నారా రోహిత్, రెజీనా కాంబినేషన్లో సినిమా షురూ

Nara Rohith Regina again pair together for a action Entertainer

Nara Rohith Regina again pair together for a action Entertainer

బాణం నుండి లేటెస్ట్‌గా వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడు వరకు తాను చేసినవన్నీ ఢిఫరెంట్ ప్రాజెక్టులే. కథలో కొత్తదనం కోరుకొనే నారా రోహిత్ లేటెస్ట్‌గా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతునున్న సినిమా ప్రారంభం అయ్యింది. వి.ఎం.పి సంస్థ పతాకంపై బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీకృష్ణ, నందమూరి శ్రీవినోద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా పవన్ మల్లెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావుగారు కెమెరా స్విచ్చాన్ చేశారు. మరో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ స్క్రిప్ట్ ను దర్శకుడు పవన్ కు అందించారు.

ఈ సందర్భంగా నిర్మాతలు బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీకృష్ణ, నందమూరి శ్రీవినోద్ లు మాట్లాడుతూ.. “చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగిడుతూ రోహిత్ హీరోగా పవన్ మల్లెల దర్శకత్వంలో చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రముఖ సీనియర్ నటీమణి రమ్యకృష్ణగారు ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషించనున్నారు. “నరసింహ” చిత్రంలోని నీలాంబరి రేంజ్ క్యారెక్టర్ ఆవిడది. నారా రోహిత్ సరసన రెజీనా హీరోయిన్గా నటించనుంది. టామ్ బోయ్ తరహా క్యారెక్టర్ ఆమెది. మా చిత్ర ప్రారంభోత్సవానికి వినాయక్, కె.ఎస్.రామారావు, బెల్లంకొండ సురేష్ వంటి చిత్ర ప్రముఖులు ముఖ్య అతిధులుగా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.

నారా రోహిత్, రెజీనా, రమ్యకృష్ణ, అజయ్, పృధ్వీ, వెన్నెల కిషోర్, రఘుబాబు, శివప్రసాద్, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, స్టోరీ-డైలాగ్స్: కొలుసు రాజా, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాతలు: బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీకృష్ణ, నందమూరి శ్రీవినోద్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పవన్ మల్లెల

Have something to add? Share it in the comments

Your email address will not be published.