‘వీర భోగ వ‌సంత రాయ‌లు’ ఎవరో తెలుసా???

Nara Rohith Sri Vishnu pairing together once again for Veera Bhoga Vasantharayalu with Shriya Saran
Nara Rohith Sri Vishnu pairing together once again for Veera Bhoga Vasantharayalu with Shriya Saran
వైవిధ్య‌మైన చిత్రాల‌తో ఎప్పుడూ ప్రేక్ష‌కుల్ని అల‌రించేదిశ‌గా త‌మ సినీ ప్ర‌యాణం సాగిస్తున్న నారారోహిత్‌, శ్రీవిష్ణు గతేడాది చివర్లో సినీప్రేక్ష‌కుల్ని, విమ‌ర్శ‌కుల‌ని సైతం మ‌న‌సుతో కంట‌త‌డి పెట్టించిన వినూత్న‌క‌థా చిత్రం అప్ప‌ట్లో ఒక‌డుండేవాడులో నటించిన వీళ్ళిద్దరూ  మరోసారి కలిసి నటిస్తున్న మూవీ వీర భోగ వసంత రాయ‌లు.. వైవిధ్యంగా ఉన్న ఈ సినిమా టైటిల్‌ మాదిరిగానే వైవిధ్యమైన కథతో బాబా క్రియేష‌న్స్ ప‌తాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్ల‌న నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాతో ఇంద్ర‌సేన‌.ఆర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని ఈ వినూత్న కథా చిత్రంలో ఎప్ప‌టికి చెక్కుచెర‌గ‌ని గ్లామ‌ర్ తో అల‌రించే శ్రియా శ‌ర‌ణ్ మ‌రో ముఖ్య‌ పాత్ర‌లో న‌టిస్తుండగా… జ్యోతిల‌క్ష్మి ఫేం సత్యదేవ్ మ‌రో కీలక పాత్ర‌లో న‌టిస్తున్నాడు.
ఈ సంద‌ర్బంగా నిర్మాత అప్పారావు బెల్ల‌న మాట్లాడుతూ.. ఇంద్ర‌సేన నాకు చాలా మంచి మిత్రుడు. ఆయ‌న నాకు ఈ క‌థ చెప్పగానే మైండో బ్లో అయింది. చెప్పిన‌ వెంట‌నే ప్రొడ్యూస్ చేద్దామ‌నిపించింది. అలాగే ఈ క‌థ‌కి కాస్టింగ్ కూడా క‌థ లానే వైవిధ్యంగా వుండాలి. వెంట‌నే శ్రీ విష్ణు కి చెప్పాము. ఆయ‌న విన్న‌వెంట‌నే చేద్దామ‌ని చెప్పారు. అలానే నారా రోహిత్ గారు విన్న వెంట‌నే ప్రోసీడ్ అన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు క‌మ‌ర్షియాలిటి మిస్ కాకుండా వైవిధ్య‌మైన క‌థ‌లు, పాత్ర‌లు చేస్తూ ప్రేక్ష‌కుల్ని అల‌రించే రోహిత్ గారు, శ్రీ విష్ణు గారు అంగీకరించేస‌రికి ఈ ప్రాజెక్ట్  మీద మాకు రెస్పాన్సిబిలిటీ  మరింత పెరిగింది.
శ్రియ కథ విని చాలా ఎక్సైట్ అయ్యి అంగీక‌రించారు. అలానే స‌త్య‌దేవ్ ని తీసుకున్నాము. ఈ నాలుగు పాత్ర‌లు వీరి పాత్ర‌ తీరు ఖ‌చ్చితంగా ఇప్ప‌టివ‌ర‌కూ ఏ చిత్రంలో ఏవ‌రూ చెయ్య‌ని విధంగా ద‌ర్శ‌కుడు ఇద్ర‌సేన తీర్చిదిద్దాడు. ఈ చిత్రం మెద‌టి లుక్ చూసిన ప్ర‌తి ఒక్క‌రూ థ్రిల్ ఫీల‌వుతార‌నేది మా న‌మ్మ‌కం. ఏ పాత్ర‌కి మ‌రో పాత్ర‌కి పోలిక వుండ‌దు. టైటిల్ కథ అనుకున్నప్పుడే డైరెక్టర్ వీర భోగ వసంత రాయలు అనే టైటిల్ ఫిక్స్ చేశాం. అలాగే టెక్నిషియ‌న్స్ విష‌యంలో కూడా ఏమాత్రం కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాము. మే రెండ‌వ వారం నుండి సెట్స్ మీద‌కి వెళ్ళ‌నుంది. మిగ‌తా వివ‌రాలు అతిత్వ‌ర‌లో తెలియ‌జేస్తాం.. అని అన్నారు
ద‌ర్శ‌కుడు ఇంద్ర‌సేన.ఆర్ మాట్లాడుతూ.. ఇది సొసైటీలో జరిగే గ్రే అండ్ డార్క్ సైడ్ లను టచ్ చేసే వినూత్నమైన మల్టీస్టారర్ స్టోరీ. నాన్ లీనియర్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాం. అని అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.