అక్రమంగా తరలిస్తున్న మత్తు పదార్ధం స్వాధీనం

narcotics-drug-sezied-at-shashmabad-airport

narcotics-drug-sezied-at-shashmabad-airport

హైదరాబాద్: రంగారెడ్డి శంషాబాద్ విమానాశ్రయo లో కస్టమ్స్ ఆఫీసర్స్ అఫ్ ఎయిర్ ఇంటలిజెన్స్ యూనిట్  అధికారులు దాడులు చేపట్టారు.  హైదరాబాద్ నుండి MH 0199 నంబర్ మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానం లో మలేషియాకు డ్రగ్స్ తరలించేందుకు ప్రయత్నిస్తుండగా కస్టమ్స్‌ ఎయిర్ ఇంటిలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు పసుపు, కుంకుమ డబ్బాల్లో డ్రగ్స్ ను ప్యాక్ చేసి తరలించే సమయంలో పట్టుబడ్డాడు. పట్టుబడిన డ్రగ్స్ కేటమైన్ అని అధికారులు గుర్తించారు. సుమారు 5.924 కిలోలు గల కేటమైన్ విలువ రూ 2.37 కోట్ల రూపాయలు ఉంటుందని అదికారుల అంచనా వేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కస్టమ్స్‌ అధికారులు విచారణ చేపట్టారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.