ఎర్రబుగ్గపై నిషేదం

Narendra Modi govt bans use of red beacon lights on Vehicles Of Ministers, Officers across India  From May 1

Narendra Modi govt bans use of red beacon lights on Vehicles Of Ministers, Officers across India  From May 1

వీఐపీ సంస్కృతికి తెరదించడానికి రంగం సిద్ధమౌతోంది. అందులోభాగంగా వీఐపీ కార్లపైన ఉండే బీకాన్స్ (ఎర్ర బుగ్గ / నీలం బుగ్గ)ల వినియోగాన్ని నిషేదిస్తూ కేంద్రమంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో మే1 నుండి వీధుల్లో వీఐపీ బుగ్గకార్ల అనవసర హడావుడి కనిపించదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, లోక్‌సభ స్పీకర్, సీజెఐలు మినహా అందరు వీఐపీలు, ఆఫీసర్ల కార్లకు ఉన్న ఎర్రబుగ్గను మే1 నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌లు తమ కార్లపై ఎర్రబుగ్గలను ఇప్పటికే తొలగించారు. వీరు అమలు చేసిన నెల తర్వాత కేంద్ర మంత్రివర్గం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. అయితే అంబులెన్స్‌లు, సైనిక, పోలీసు అధికారుల వాహనాలపై మాత్రం నీలం రంగు బుగ్గలను కొనసాగించనున్నారు.

కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న వెంటనే గడ్కరీ తన కారుకు ఉన్న ఎర్రబుగ్గను తొలగించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ మే1న వెలువడనుంది. మంత్రివర్గ సమావేశం తర్వాత కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ విషయాన్ని తెలియచేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.