వీడి దెబ్బకి కుదేలైన కోహ్లీ సేన

Nathan Lyon spins tourists to strong position in Bangalore Test

Nathan Lyon spins tourists to strong position in Bangalore Test

జెంటిల్మెన్ గేమ్‌లో రికార్డుల మోత మోగుతోంది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇప్పుడు చర్చ అంతా ఆ ఒక్కడిపైనే. భారత లైనప్‌ను కుదేలు చేసి 189 పరుగులకే కట్టడి చేసి మ్యాచ్‌లో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారాడు ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లియాన్. భారత బ్యాట్స్‌మెన్లను కట్టడి చేయడమేకాకుండా చిన్నస్వామి స్టేడియం సాక్షిగా రికార్డుల మోత మోగించాడు.

ఇప్పటివరకు భారత్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్‌లీ (53 వికెట్లు) రికార్డును సైతం తిరగరాసి రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 50 పరుగులిచ్చిన లియాన్ ఎనిమిది వికెట్లు సాధించాడు. అంతేగాక ఇప్పటికే విరాట్ కోహ్లీని, పూజారాలను ఐదుసార్లు పెవిలియన్‌దారి పట్టించి రికార్డు రాసుకున్నాడు. వీటికితోడు చిన్నస్వామి స్టేడియంలో అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్‌గా నాథన్ లియాన్ గుర్తింపు సాధించాడు.

నాథన్ లియాన్ బాధితులు:

పుజారా (17),

విరాట్‌కోహ్లీ (12),

అజింక్య రహానె (17),

అశ్విన్‌ (7),

వృద్ధిమాన్‌ సాహా (3),

రవీంద్ర జడేజా (3),

కేఎల్‌ రాహుల్‌ (90),

ఇషాంత్‌శర్మ (0)

Have something to add? Share it in the comments

Your email address will not be published.