కోహ్లీతో చర్చ తర్వాతే ఏదైనా…

Need to discuss with Captain before decision on Coach says Ganguly

గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెరలేచిన భారత క్రికెట్ జట్టు కోచ్ వ్యవహారం అంత తొందరగా తేలేటట్లు కనిపించట్లేదు. ఇప్పటికే క్రికెట్ ఉద్ధండులు కోచ్ పదవి కోసం అప్లై చేసిన నేపథ్యంలో  కొత్త కోచ్ ఎంపిక కోసం క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.

Need to discuss with Captain before decision on Coach says Ganguly

కొత్త కోచ్ ఎంపిక కోసం క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ స‌భ్యులు బీసీసీఐ హెడ్‌క్వార్ట‌ర్స్‌లో సమావేశమయ్యారు. వీళ్ల‌తోపాటు కోచ్ ప‌ద‌వి కోసం దరఖాస్తు చేసుకున్న వీరేంద్ర సెహ్వాగ్ కూడా వ‌చ్చాడు. దీంతో ఇంట‌ర్వ్యూల త‌ర్వాత సాయంత్రంలోగా కొత్త హెడ్ కోచ్ ఎవ‌రో ప్ర‌క‌టిస్తార‌ని అందరూ అనుకున్నా.. గంగూలీ చివ‌ర్లో ఇలా ట్విస్ట్ ఇచ్చాడు.కోచ్ ప‌ద‌వి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న ర‌విశాస్త్రితోపాటు సెహ్వాగ్‌, టామ్ మూడీ, రిచ‌ర్డ్ పైబ‌స్‌, లాల్‌చంద్ రాజ్‌పుత్‌ల‌ను ఇంట‌ర్వ్యూ చే సింది ప్యానెల్. ప్యానెల్‌లో గంగూలీ, ల‌క్ష్మ‌ణ్ ఉండ‌గా.. విదేశాల్లో ఉన్న స‌చిన్ స్కైప్ ద్వారా ఈ ప్ర‌క్రియ‌లో పాల్గొన్నాడు.

See Also: రవిశాస్త్రి దరఖాస్తు చేశాడోచ్

దీంతో టీమిండియా కొత్త హెడ్ కోచ్ ఎవ‌రో తేల‌డానికి మ‌రికొద్ది రోజులు ఆగాల్సిందేనని చెప్పేశాడు దాదా. కోచ్ ఎంపికకోసం త‌మ‌కు మ‌రికొన్ని రోజుల స‌మ‌యం కావాల‌ని, కెప్టెన్‌తోపాటు మ‌రికొంద‌రితో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్లడించాడు సౌరభ్ గంగూలీ. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయ‌మే త‌మ‌కు కీల‌క‌మ‌ని దాదా చెప్ప‌క‌నే చెప్పాడు. విరాట్ ఎవ‌రి పేర్ల‌నూ ప్ర‌తిపాదించ‌లేద‌ని గంగూలీ తెలిపాడు.

See Also: టార్గెట్ ప్రశాంత్ కిషోర్

Have something to add? Share it in the comments

Your email address will not be published.