రాహుల్ ఏం చేసినా తప్పేనా??

netizens-fire-biased-media-over-rahul-gandhis-mandsaur-visit-reports

netizens-fire-biased-media-over-rahul-gandhis-mandsaur-visit-reports

పదేళ్ళపాటు దేశంలో యువరాజుగా మెలిగిన రాహుల్‌గాంధీ ఇప్పుడు ఏం చేసినా మీడియాకు తప్పుగానే కనిపిస్తోంది. దేశంలో ఎక్కడైనా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చడానికి చేస్తున్న పనులను అటు అధికారులు, ఇటు మీడియా సైతం తప్పుబడుతోంది. మధ్యప్రదేశ్‌ మాంధసౌర్‌కు వెళ్ళడానికి ప్రయత్నించి రాహుల్‌గాంధీని మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు అజ్ఞాతంలోకి తీసుకెళ్ళారు. అయితే ఇక్కడ మీడియా చేసిన హడావిడిని విమర్శిస్తూ సోషల్‌మీడియాలో నెటిజన్లు చేస్తున్న పోస్టులు తెగచక్కర్లు కొడుతున్నాయి.

” మోదీ పిచ్చిలో కొట్టుకుపోతున్న దేశ మీడియా రాహుల్ గాంధీని ఆడిపోసుకుంటోంది. ఆయన కదిలినా ,మెదిలినా పెడార్దాలు తీసి ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియా అయితే మరీ రాహుల్ ను ఆడుకుంటోంది. సమయం,సందర్భం లేకుండా ఆయనను కాషాయ మీడియా టార్గెట్ చేస్తోంది. మధ్యప్రదేశ్ లో కాల్పులు జరిపి ఐదుగురు రైతుల ఉసురు తీసుకుంది బీజేపీ సర్కార్. రైతుల ఆందోళనలతో ఆ రాష్ట్రం అట్టుడికి పోతోంది. గిట్టుబాటు ధర,రుణమాఫీ కోసం రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు.”

“ఈ పరిస్థితుల్లో చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించడం కోసం రాహుల్ గాంధీ మాంధసౌర్ కు వెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళడానికి రాహుల్ కు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో ఆయన తన కాన్వాయ్ ను పక్కన పెట్టి మోటార్ సైకిల్ పైన మాందసౌర్ వెళ్లారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండే రాహుల్ గాంధీ కేవలం ఒకే ఒక గార్డుతో ఆ ప్రాంతానికి వెళ్లారు. అయితే రాహుల్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిన మీడియా కోడిగుడ్డు మీద వెంట్రుకలను వెతికే ప్రయత్నం చేసింది.”

“రాహుల్ గాంధీ రోడ్డు భద్రతా నియమాలను అతిక్రమించారని పనికి రాని లాజిక్ లను బయటకు తీశారు. మోటార్ సైకిల్ మీద ముగ్గురు ప్రయాణించి రూల్స్ బ్రేక్ చేశారని పస లేని రాతలు రాశారు. ఒక వేళ ఆయన విహార యాత్రకు వెళ్లిన సమయంలో ఇలాంటివి చేస్తే కామెంట్ చేసినా అర్థం ఉండేది. కాని ఆయన చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించడం కోసం పోలీసుల ఆంక్షల మధ్య మోటార్ సైకిల్ ఎక్కారన్న విషయం కూడా మీడియా పట్టించుకోకపోవడం దారుణం.”

“రూల్స్ ను అతిక్రమించారంటూ సమయం, సందర్భం లేకుండా ఆర్టికల్స్ రాయడం ఎంత వరకు సమంజసం ? రైతులకు అండగా నిలబడటానికి వచ్చిన రాహుల్‌ను అభినందించాల్సి పోయి అర్థం పర్థం లేని వర్థమైన కథనాలు అల్లితే ఏం ప్రయోజనం ? రైతులను కాల్చి చంపిన బీజేపీ సర్కార్‌ను ప్రశ్నించాల్సిన మీడియా మోదీ భజన చేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు తిరుగుబాటు చేస్తుంటే కళ్లప్పగించి చూస్తున్న వారు రాహుల్ గాంధీ మీద ఆప్ బీట్ ఆర్టికల్స్ రాసి సంతోషిస్తున్నారు. కాషాయ యాడ్స్‌ కోసం కక్కుర్తి పడే వారు మాట్లాడకుండా మౌనంగా ఉండటం మేలు. అలా కాక మసిపూసి మారేడు కాయ చేస్తే జనం ముందు పరువు పొగొట్టుకోవాల్సి ఉంటుంది.”

ఇది కేవలం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక పోస్ట్ మాత్రమే. ఇలాంటి పోస్టులు ఇంకా చాలా నెటిషన్లు షేర్ చేసుకుంటున్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.  • Challa Srinivasreddy says:

    Aapadhalo unnapudu palakarinchinavare aapthulu,