అచ్చెన్నకు ప్రమోషన్ – ప్రత్తిపాటికి డిమోషన్

New Portfolios assigned to the ministers in AP after reshuffling by Chandrababu Naidu

New Portpholios assigned to the ministers in AP after reshuffling by Chandrababu

 

ఏపి మంత్రివర్గ విస్తరణలో భాగంగా క్యాబినెట్‌లో కొత్తగా చేరిన 11మంది మంత్రులకు శాఖలు కేటాయించడంతోపాటు మిగతా మంత్రుల్లో కొందరికి శాఖల మార్పులు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. నిన్న మంత్రివర్గ విస్తరణ తర్వాత తెలుగు తమ్ముళ్ళలో వచ్చిన అసంతృప్తిని ఈరోజు ఉదయం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడి సెటిల్ చేశారు.

బిజెపి మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పు చేయలేదు. వీళ్ళకితోడు ఇద్దరు ఉపముఖ్యమంత్రులు కెఈ క‌ృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్పలతోపాటు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, నారాయణల శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ముఖ్యంగా వ్యవసాయశాఖ చూసిన ప్రత్తిపాటి పుల్లారావుకు శాఖల్లో కోత విధించి సివిల్ సప్ల్సై శాఖను కేటాంయించారు. అంతేగాక కార్మికశాఖ చూస్తున్న అచ్చెన్నాయుడుకు ప్రమోషన్ ఇచ్చి రవాణాశఆఖ, బిసి సంక్షేమశాఖ ఇచ్చారు. అంతేకాకుండా అందరూ అనుకున్నట్లుగానే నారా లోకేష్‌కు ఐటీ కమ్యూనికేషన్స్‌తోపాటు గ్రామీణాభివ‌ృద్ధిశాఖను కేటాయించారు.

 

ఆంధ్రప్రదేశ్ మంత్రుల శాఖల కేటాయింపులు

 1. నారా చంద్రబాబు నాయుడు : ముఖ్యమంత్రి, జిఎడి, పెట్టుబడులు, మైనారిటీ, సినిమాటోగ్రఫీ, ఇతరులకు కేటాయించని శాఖలు
 2. అచ్చెన్నాయుడు – రవాణాశాఖ, బిసి సంక్షేమం, హ్యాండ్‌లూమ్స్
 3. కళా వెంకట్రావు : విద్యుత్ శాఖ
 4. సంజయ్‌ కృష్ణ రంగారావు : గనుల శాఖ
 5. గంటా శ్రీనివాసరావు : మానవవనరుల అభివ‌ద్ధిశాఖ
 6. చింతకాయల అయ్యన్నపాత్రుడు : ఆర్.అండ్.బి
 7. యనమల రామకృష్ణుడు : ఆర్థిక శాఖ, అసెంబ్లీ వ్యవహారాలు
 8. నిమ్మకాయల చినరాజప్ప : హోం అండ్ డిసాస్టర్ మేనేజ్‌మెంట్
 9. కేఎస్‌. జవహర్‌ : ఎక్సైజ్
 10. పితాని సత్యనారాయణ : కార్మిక ఉపాధికల్పనాశాఖ
 11. మాణిక్యాలరావు : దేవాదాయ శాఖ
 12. కామినేని శ్రీనివాసరావు : ఆరోగ్యశాఖ
 13. దేవినేని ఉమ : నీటిపారుదలశాఖ
 14. కొల్లు రవీంద్ర : లా అండ్ జస్టిస్, యూత్ స్పోర్ట్స్, ఎన్‌ఆర్‌ఐ రిలేషన్స్
 15. ప్రత్తిపాటి పుల్లారావు : ఫుడ్ అండ్ సివిల్ సప్ల్సై, ధరల స్థిరీకరణ
 16. నక్కా ఆనంద్‌బాబు : సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖ
 17. సిద్ధా రాఘవరావు : ఎన్విరాన్‌మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
 18. నారాయణ : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ హౌజింగ్
 19. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి: వ్యవసాయశాఖ
 20. ఆదినారాయణరెడ్డి : మార్కెటింగ్, వేర్ హౌజింగ్
 21. కేఈ కృష్ణమూర్తి : రెవిన్యూ, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్
 22. భూమా అఖిలప్రియ : టూరిజం, తెలుగు అభివ‌ృద్ధి
 23. పరిటాల సునీత : సెర్ప్, ఉమన్ ఎంపవర్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్, వికలాంగుల, వ‌ృద్ధుల సంక్షేమం
 24. కాలువ శ్రీనివాసులు : గ్రామీణ హౌజింగ్ , ఐ అండ్ పిఆర్
 25. నారా లోకేశ్‌: పంచాయత్ రాజ్, గ్రామీణ అభివ‌ద్ధి, ఐటీ కమ్యూనికేషన్స్
 26. అమర్‌నాథ్‌ రెడ్డి : పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి బిజినెస్

 

New Portfolios assigned to the ministers in AP after reshuffling by Chandrababu Naidu1

Have something to add? Share it in the comments

Your email address will not be published.