సీనియర్లకు కొత్త చిక్కులు ?

New Problems arising for Senior Heros in Tollywood

New Problems arising for Senior Heros in Tollywood

 

టాలీవుడ్ లో కొత్త హీరోలు అంత ఎక్కువగా రావడం లేదు కానీ హీరోయిన్లు మాత్రం వస్తూనే ఉన్నారు. దాదాపు ఏడెనిమిదేళ్ల నుంచి గమనిస్తే కొత్తగా వచ్చిన హీరోలు వేళ్ల మీద లెక్కబెట్టే నంబర్ లోనే ఉన్నారు. కానీ హీరోయిన్స్ మాత్రం ఏటా కనీసం అయిదారుగురు మూవీ ఫీల్డ్ కు పరిచయమవుతున్నారు. విచిత్రమేంటంటే ఇంతమంది హీరోయిన్స్ వస్తున్నా టాలీవుడ్ సీనియర్ హీరోలకు సరైన హీరోయిన్ దొరకడం లేదు. దాదాపు సీనియర్ హీరోలంతా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు.
స్టార్ హీరో సినిమా ప్రారంభమవుతోందంటే చాలా హంగామా ఉంటుంది. బ్రహ్మాండమైన హడావుడితో మూవీని లాంచ్ చేస్తారు. కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం చాలా రోజుల దాకా స్టార్ట్ కాదు. కారణం ఆ సీనియర్ హీరోకు తగ్గ సీనియర్ హీరోయిన్ దొరక్కపోవడం. మన టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ఒక్కోసారి నాగార్జున ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నలుగురు హీరోలూ 50 ఏళ్లు దాటేశారు కాబట్టి వారి ఏజ్ కు సూట్ అయ్యే భామ దొరకడం కష్టమవుతోంది.
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అయితే ఆయన చేసిన ఖైదీ నంబర్ 150కి చాలా రోజుల దాకా హీరోయిన్ దొరకలేదు. చిరంజీవి వయసుకు తగ్గ సీనియర్ హీరోయిన్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. మూవీ స్టార్ట్ అయినా హీరోయిన్ దొరకలేదు. అలాగే బాలకృష్ణకు కూడా లెజెండ్ దగ్గర్నుంచి ఇదే సమస్య వెంటాడుతోంది. ఆయన వయసుకు, పర్సనాలిటీకి తగ్గ హీరోయిన్ కోసం ప్రతిసారీ వెతుక్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు బాలయ్య పూరీ జగన్నాథ్ తో చేసే సినిమాకు కూడా ఇదే ఇబ్బంది ఎదురవుతోందట.

ఇక విక్టరీ వెంకటేష్ కు కూడా బాబు బంగారం టైంలో ఈ సమస్యే ఎదురైంది. చివరికి నయనతారను తీసుకున్నారు. హీరోలకు ఈ ప్రాబ్లెమ్ రావడానికి మరో కారణం కూడా ఉంది. ఆ హీరోయిన్ తో రొమాన్స్ చేసే సీన్లు ఉండడం. ఒకవేళ రొమాన్స్ చేయకపోతే హీరోయిన్ దొరక్కపోవడమనే సమస్య ఇంతగా ఉండదు. నాగార్జున ఇటీవల నటించిన ఊపిరి, నిర్మలా కాన్వెంట్, సోగ్గాడే చిన్ని నాయనా, ఓం నమో వెంకటేశాయ వంటి మూవీస్ లో నాగ్ కు ఈ సమస్య రాలేదు. ఎందుకంటే ఆ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ అంతగా లేవు.

టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు ఇక్కడి హీరోయిన్స్ దొరక్క బాలీవుడ్ నుంచి రప్పించుకుంటున్నారు. ఈ హీరోలు హీరోగా కాకుండా హీరోయిన్స్ తో రొమాన్స్ లేని కీలకమైన పాత్ర చేసేటప్పుడు ఈ సమస్య రావడంలేదు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.