కశ్మీర్‌పై కన్నేసిన చైనా

New Threat to India by China in the name of Kashmir

అంతర్జాతీయంగా ఎంతో సున్నితమైన కశ్మీర్ అంశంలో వేలుపెట్టి కెలికే ఆలోచనలో ఉంది చైనా. ఇప్పటికే సిక్కింలో భారత జవాన్లను రెచ్చగొడుతూ ముందుకు దూసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్న చైనా ఆర్మీ అవసరమైతే కశ్మీర్ అంశంలోనూ దూరాలని యోచిస్తోంది. అందులోభాగంగా భూటాన్ త‌ర‌ఫున డోక్లామ్‌లో చైనాకు వ్య‌తిరేకంగా ఇండియా ఎలా పోరాడుతున్న‌దో క‌శ్మీర్ అంశానికీ అదే వ‌ర్తిస్తుంద‌ని ఆ దేశ నిపుణుడు ఒక‌రు హెచ్చ‌రించారు.

New Threat to India by China in the name of Kashmir

గత కొన్నేళ్ళుగా అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరుగుతున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో చైనా నుండి భారత్‌కు ముప్పు ఉందని ఎప్పటినుండో నిపుణులు చెబుతున్న విషయం ఈమధ్య బలపడుతోంది. సిక్కిం అంశం హింసాత్మకంగా మారుతున్న పరిస్థితుల్లో చైనా నుంచి తాజాగా మ‌రో బెదిరింపు వ‌చ్చింది. ఒక‌వేళ పాకిస్థాన్ కోరితే మూడో దేశ ఆర్మీ క‌శ్మీర్‌లో అడుగుపెడుతుంద‌ని ప‌రోక్షంగా భారత్‌కు బెదిరింపులు చేస్తున్నారు చైనీయులు.

See Also: మన ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు??

భూటాన్ భూభాగాన్ని కాపాడే బాధ్య‌త‌ను ఇండియా తీసుకుంటే.. అది అక్క‌డికే ప‌రిమిత‌మవుతుంది కానీ.. వివాదాస్ప‌ద ప్రాంతంపై కాద‌ని చైనా నిపుణులు స్ప‌ష్టంచేస్తున్నారు. చైనా అధికార ప‌త్రిక గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రిక‌కు రాసిన ఆర్టిక‌ల్‌లో చైనా వెస్ట్ నార్మ‌ల్ యూనివ‌ర్సిటీ డైరెక్ట‌ర్‌ లాంగ్ జింగ్‌చున్ తాజా హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇండియా కోణంలోనే ఆలోచిస్తే.. ఒక‌వేళ పాకిస్థాన్ కోరితే మూడో దేశానికి చెందిన ఆర్మీ ఇండోపాక్ వివాదాస్ప‌ద ప్రాంతంతోపాటు ఇండియాలో ఉన్న క‌శ్మీర్‌లోనూ అడుగుపెడుతుంద‌ని లాంగ్ జింగ్‌చున్ అన్నారు.

చైనా, భూటాన్ మ‌ధ్య వివాదం ఉంటే.. అది రెండు దేశాలు చ‌ర్చ‌ల‌తో ప‌రిష్క‌రించుకోవాల‌ని, భూటాన్ సార్వ‌భౌమాధికారాన్ని ఇండియా గౌర‌వించాల‌ని ఆ ప‌త్రిక చెప్పింది. మ‌రోవైపు ద‌లైలామా పేరుతో చైనాతో సంబంధాల‌ను చెడ‌గొట్టుకోవ‌ద్ద‌ని గ్లోబ‌ల్ టైమ్స్ ప‌త్రికే మ‌రో ఆర్టిక‌ల్‌లో ఇండియాకు సూచించింది. ఎన్ని హెచ్చ‌రిక‌లు, బెదిరింపులు చేసినా ఇండియా వెన‌క్కి త‌గ్గ‌క‌పోవ‌డంతో ఇప్పుడు క‌శ్మీర్ అంశంలో వేలు పెట్టాల‌ని చైనా చూస్తోంది..

See Also: హద్దు దాటిన చైనా

నిజానికి భూటాన్ పేరు చెప్పి చైనాకు చెందిన డోక్లామ్‌లో భార‌త సైన్య అడుగుపెట్టింది కానీ.. భూటాన్ పేరుతో ఇది ఇండియాకు మేలు చేసేదే అని లాంగ్ చెప్పారు. డోక్లామ్‌లో భార‌త సైన్యం ప్ర‌వేశించడం అంత‌ర్జాతీయ ఒప్పందాల‌ను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని ఆ ప‌త్రిక అభిప్రాయ‌ప‌డింది.

మొత్తానికి భారత్‌ను దెబ్బతీయడానికి ఎన్నిరకాల పన్నాగాలు పన్నైనా విషయాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చైనీయులు భావిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.