హద్దు దాటితే పాయింట్ల మోతే…

New Traffic rules going to implemented in Hyderabad from August 1st

పాయింట్ల విధానాన్ని తీసుకొచ్చి జనాల్లో ట్రాఫిక్ అవేర్‌నెస్ పెంచడమేకాకుండా నిబంధనలను పాటించేలా క్రమశిక్షణా చర్యలు తీసుకొనేలా రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. స్కూల్ చదువుకొనేటప్పుడు ఒక్కో పనికి ఒక్కో రకమైన పాయింట్ల విధానం ఉండేది. ఎవరు ఎక్కువ పాయింట్లు తెచ్చుకుంటే వాళ్ళే గొప్ప అనే విధంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అయితే ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి రానున్న కొత్త ట్రాఫిక్ నిబంధనలతో పాయింట్లు ఎంతపెరుగుతూ పోతే ఇబ్బందులు అన్ని పెరుగుతూ వస్తుంటాయి.

New Traffic rules going to implemented in Hyderabad from August 1st

ఇప్పటివరకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారికి జరిమానా విధించి వదిలిపెట్టేవాళ్ళు. అయితే ఇప్పుడు తెస్తున్న కొత్త విధానంతో జరిమానాలతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వారికి ప్రతి తప్పుకు కొన్ని పాయింట్లను వారి ఖాతాల్లోకి చేర్చనున్నారు. దీంతో రెండు సంవత్సరాల్లో 12 పాయింట్లు దాటితే సంవత్సరం పాటు లైసెన్సును రద్దు చేయడానికి రెడీ అయ్యారు పోలీసులు. అంతేగాక మళ్ళీ రెండు సంవత్సరాల్లో మరో 12 పాయింట్లు తెచ్చుకుంటే మూడు సంవత్సరాల వరకు డ్రైవింగ్‌ లైసెన్సును సస్పెండ్‌ చేస్తారు. ఇంత జరిగిన తర్వాత కూడా మారకుండా నిబంధనలను ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపిస్తే శాశ్వతంగా లైసెన్స్‌ రద్దుతో పాటు భారీ జరిమానా, జైలు శిక్ష అమలయ్యేలా నూతన చట్టాలను అమల్లోకి తీసుకొస్తున్నారు.

See Also: ఆపరేషన్ బ్లాక్ ఫిల్మ్ షురూ

నిబంధన అతిక్రమణ – పాయింట్లు

– సీట్‌ బెల్టు లేదా హెల్మెట్‌ లేకుండా వాహనాలను నడిపితే : 1 పాయింటు
– రాంగ్‌ సైడ్‌లో వాహనం నడుపుతూ పట్టుబడితే : 2 పాయింట్లు
– మద్యం తాగి ద్విచక్ర వాహనం నడిపితే : 3 పాయింట్లు
– మద్యం తాగి నాలుగు చక్రలా వాహనాలు, లారీ, రవాణా వాహనాలు నడిపితే : 4 పాయింట్లు
– మద్యం తాగి ప్రజా రవాణా వాహనాలు, బస్సులు, క్యాబ్ లు నడిపితే: 5 పాయింట్లు

– నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఎదుటివారి మృతికి కారకులైతే.. (కోర్టులో నేరం రుజువైతే) 304ఎ ఐపీసీ లేదా 304 ఐపీసీ కింద : 5 పాయింట్లు
– చైన్‌స్నాచింగ్‌, దోపిడీ తదితర నేరాల్లో వినియోగించిన వాహనాలతో పట్టుబడితే (కోర్టులో నేరం రుజువైతే) : 5 పాయింట్లు

– అనుమతి ఉన్న వేగం కంటే గంటకు 40 కిలోమీటర్లు మించిన వేగంతో నడిపితే: 2 పాయింట్లు
– అనుమతి ఉన్న వేగాన్ని అధిగమించి గంటకు 40 కిలోమీటర్ల పైబడి నడిపితే : 2 పాయింట్లు
– రాష్‌గా వాహనం నడపడం, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, వాహనానికి ఇరుపక్కల అధికంగా వస్తువులను తీసుకెళ్లడం, ట్రాఫిక్‌ సిగ్నళ్లను అతిక్రమించడం, జీబ్రా లైన్లను దాటడం, జిగ్‌జాగ్‌ డ్రైవింగ్‌కు : 2 పాయింట్లు

– వాహనాలు నడుపుతూ రేసింగ్‌, వేగ పరీక్షల్లో పట్టుబడితే : 3 పాయింట్లు
– ప్రమాదకరస్థితిలో ఉన్న వాహనాన్ని వినియోగించడం, రోడ్లపై అభ్యంతరకరంగా ఉన్న హారన్‌ను వినియోగించడం, పొల్యూషన్‌ లేక పోవడం, హైవేపై ప్రమాదకరంగా వాహనాన్ని నడిపితే : 2 పాయింట్లు

– ఇన్సూరెన్స్‌ లేకుండా వాహనాన్ని నడిపితే : 2 పాయింట్లు
– అపాయకరమైన వస్తువులను తీసుకెళ్లే వాహనాలకు పబ్లిక్‌ లయబులిటీ సర్టిఫికెట్‌ లేకుండా నడిపితే : 2 పాయింట్లు
– గుర్తించదగిన నేరాలు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్‌ 279, 336, 237, 338 కేసుల్లో నేరం రుజువైతే : 2 పాయింట్లు
– ఆటోలలో డ్రైవర్‌ పక్కసీట్‌లో ప్రయాణికులను తీసుకెళుతూ పట్టుబడితే : 1 పాయింటు
– గూడ్స్‌ వాహనాల్లో (వస్తువులను) తీసుకెళ్లే వాహనాల్లో ప్రయాణికులను తీసుకెళ్తే : 2 పాయింట్లు

See Also: టార్గెట్ 2019: కెటిఆర్ ఏం చేయబోతున్నారో తెలుసా??

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.