లోకేష్‌కు కీలకమైన 100 రోజులు

Next 100days will be much crucial for him says Nara Lokesh

Next 100days will be much crucial for him says Nara Lokesh
ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖామంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటినుండి ఎంతో బిజీగా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి సమీక్షలు నిర్వహిస్తూ, వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతున్న నారా లోకేష్‌కు రాబోయే 100 రోజులు చాలా కీలకమట. రాబోయే వంద రోజుల్లో హెచ్‌సీఎల్‌ సహా మూడు సంస్థలు రాష్ట్రానికి రాబోతున్న సందర్భంలో వీటి ద్వారా 15వేల ఉద్యోగాలు వస్తాయని లోకేష్ తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఐటీ కంపెనీలు చాలా విశాఖపట్టణంకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయన్న్నాన లోకేష్ హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు  సైతం చాలామంది విశాఖకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

అందుకోసం రాబోయే వంద రోజులు మరితం కష్టపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఐటీ పరిశ్రమలను విశాఖకు తరలించడానికి అవసరమైన సమావేశాలను కంపెనీ ప్రతినిధులతో నిర్వహిస్తున్నారు లోకేష్. అంతకుముందు లోకేష్ ప్రతిపక్ష నేత జగన్‌పై నిప్పులు చెరిగారు. శాసనసభను స్తంభింపజేస్తామన్న ఆయన వ్యాఖ్యలను తప్పబట్టారు. జగన్ ప్రధాని వద్ద ప్రస్తావించింది ఒకటైతే ప్రజలకు చెప్పింది మరొకటని విమర్శించారు. రైతుల సమస్యలను తీరుస్తున్నందుకు జగన్ శాసనసభను స్తంభింపజేస్తారా? అని లోకేశ్ ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాల్లోనూ మిర్చి, పసుపు రైతులకు అంతంత మాత్రంగా చెల్లిస్తుంటే, ఏపీలో మిర్చి, పసుపు రైతులను ప్రభుత్వం ఆదుకున్న విషయాన్ని జగన్ మర్చిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.