ఊ.పె.కు.హ. అందరినీ ఆకట్టుకుంటుంది: నిధిప్రసాద్

Nidhi Prasad film Upekuha Movie logo launch

Nidhi Prasad film Upekuha Movie logo launch

జె.బి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సాక్షిచౌద‌రి, అలీ, బ్ర‌హ్మానందం ప్రధానపాత్రల్లో నిధి ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో భాగ్య‌ల‌క్ష్మి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `ఊ.పె.కు.హ‌`. ఈ సినిమా టైటిల్ లోగోను ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్కరోజు విడుదలచేసిన నిధిప్రసాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో లోగో లాంచ్‌ చేసారు.

ద‌ర్శ‌కుడు నిధిప్ర‌సాద్ మాట్లాడుతూ `నేను సినిమా తీసి చాలా కాల‌మైంది..ఇప్పుడు నువ్వు సినిమాలు తీయ‌లేవ‌ని అన్నారు. అయితే వారు చెప్పిన దానికి, ఇప్పుడున్న ప‌రిస్థితుల‌కు సంబంధ‌మే లేదు. ఆర్టిస్టుల‌, టెక్నిషియ‌న్స్ అంద‌రూ ఎంతో స‌పోర్ట్ చేశారు. స్క్రిప్ట్ వ‌ర్క్ అయిన త‌ర్వాత కాన్ఫిడెన్స్ వ‌చ్చి, మా ఫ్యామిలీకి చెందిన‌ వాళ్ల‌మే కలిసి ఈ సినిమా చేశాం. నేను అనుకున్న విధంగానే సినిమా తీస్తున్నాను. సినిమా బాగా వ‌స్తోంది` అన్నారు.

నిర్మాత విక్ర‌మ్ మాట్లాడుతూ `సినిమాకు రాక‌ముందు చాలా వ్యాపారాలు చేశాను. మా బావ‌గారు అయిన నిధిప్ర‌సాద్‌ను న‌మ్మి, ఆయ‌న్ను ఒప్పించి చేస్తున్న సినిమా. రాజేంద్ర‌ప్ర‌సాద్ స‌హా ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ అంద‌రూ ఎంత‌గానో స‌పోర్ట్ చేస్తున్నారు. అంద‌రినీ అల‌రించే చిత్ర‌మ‌వుతుంది` అన్నారు.

రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ `ఉళ్ళో పెళ్ళికి కుక్క‌ల హ‌డావిడి అనే దాన్ని ఊ.పె.కు.హ అనే టైటిల్‌తో ముందుకు రావ‌డం కొత్త‌గా ఉంది. సినిమా అంద‌రూ ప్యాడింగ్ ఆర్టిస్టులు నటించారు. అన్నీ క్యారెక్ట‌ర్స్‌ను గ‌మ్మ‌త్తుగా మ‌లిచారు ద‌ర్శ‌కుడు నిధిప్ర‌సాద్‌గారు. సినిమా అంతా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో అల్ల‌రి అల్ల‌రిగా ఉంటుంది` అన్నారు.

రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సాక్షిచౌద‌రి, అలీ, బ్ర‌హ్మానందం, ఎల్‌.బి.శ్రీరాం, కృష్ణ‌భ‌గ‌వాన్‌, శ్వేత మీన‌న్‌, జీవా, సూర్య‌, అమిత్‌, ర‌ఘు త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్ః జాషువా, పాట‌లుః కందికొండ‌, కెమెరాః వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః పి.నాగ‌రాజ రెడ్డి, నిర్మాతః భాగ్య‌ల‌క్ష్మి, క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః నిధిప్ర‌సాద్‌.

Have something to add? Share it in the comments

Your email address will not be published.