సోడా గోలిసోడా

Nithya Naresh Manas Soda Goli soda getting ready to release in August

ఎస్.బి ఆర్ట్ క్రియోష‌న్స్ బ్యాన‌ర్‌పై మానస్, నిత్య నరేశ్ జంటగా భువ‌న‌గిరి స‌త్య సింధూజ నిర్మాతగా మొట్ట‌మొద‌టిసారిగా నిర్మిస్తున్న చిత్రం సోడా గోలి సోడా.. ఉభయ‌గోదావ‌రి జిల్లాల్లో అమ‌లాపురం, పాల‌కొల్లులాంటి అంద‌మైన ప్ర‌దేశాల్లో మొద‌టి షెడ్యూల్ పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని ప‌లు ప్రాంతాల్లో రెండవ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. మ‌ల్లూరి హ‌రిబాబు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

Nithya Naresh Manas Soda Goli soda getting ready to release in August
ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా భారీ తారాగాణంతో హ‌స్య‌ ప్ర‌ధానంగా చిత్రీక‌రిస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌ముఖ క‌మెడియ‌న్స్ ఆలీ, కృష్ణ‌భ‌గ‌వాన్‌, గౌతంరాజు, ప్ర‌భాస్ శ్రీను, దువ్వాసి మెహ‌న్‌, అపూర్వ‌, జ‌య‌వాణిలు న‌టిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ఆగ‌ష్టులో చిత్రాన్ని ప్రేక్ష‌కుల మందుకు తీసుకురావ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు.
నిర్మాత భువ‌న‌గిరి స‌త్య సింధూజ మాట్లాడుతూ.. ఎస్‌.బి ఆర్ట్ క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో మొద‌టిషెడ్యూల్‌ని, రెండవ షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది మా చిత్రం సోడా గోలిసోడా. ఎంత మంచి చిత్రానికైనా కామెడి చాలా అవ‌స‌రం. అందుకే మా చిత్రంలో వున్న మంచి మెసేజ్‌ని చ‌క్క‌ని కామెడితో చేస్తున్నాం. ప్ర‌ముఖ క‌మెడియ‌న్స్ ఆలీ, కృష్ణ‌భ‌గ‌వాన్‌, ప్ర‌భాస్ శ్రీను, గౌతం రాజు, జ‌బ‌ర్ద‌స్త్ ఆది ఇలా చాలా మంది కామెడి చేసి ప్రేక్ష‌కుల్ని న‌వ్విస్తారు. మా ద‌ర్శ‌కుడు హ‌రిబాబు చాలా క్లారిటితో చేస్తున్న చిత్రం. ఆగ‌ష్టులో మీ ముందుకు చిత్రాన్ని తీసుకురావ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము. అని అన్నారు.

See Also: ఛార్మి తర్వాత ఇప్పుడు ఆ హీరోయినే

ద‌ర్శ‌కుడు హ‌రిబాబు మాట్లాడుతూ.. ఎస్‌.బి.ఆర్ట్ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో నేను చెప్పిన క‌థ విని స‌త్య సిందూజ గారు చేస్తున్నందుకు వారికి నా ధ‌న్య‌వాదాలు. సినిమా అన‌గానే క‌మ‌ర్షియ‌ల్ గా చూసే ఈరోజుల్లో ఈ క‌థ తెర‌కెక్కిస్తే ప‌ది మంది హ‌యిగా న‌వ్వుకుంటారు అనే స‌దుర్దేశంతో నిర్మిస్తున్నారు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెద‌టి రెండు షెడ్యూల్స్ ని పూర్తిచేసుకున్నాం.  మిగ‌తా షెడ్యూల్స్ ని ,పాట‌ల చిత్రీక‌ర‌ణ పూర్తిచేసి అగ‌ష్టు లో విడుద‌ల కి ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా మా కెమెరామెన్ ముజీర్ మాలిక్ గురించి చెప్పాలి. మా విజ‌న్ కి ఆయ‌న అనుభ‌వం తో ప్ర‌తి ఫ్రేమ్ రిచ్ గా వస్తుంది. చిత్రం చూసిన ప్ర‌తిఓక్క‌రు కెమెరా వ‌ర్క్ గురించి మాట్లాడుకుంటారు. న‌టించిన అంద‌రూ న‌టీన‌టులు చాలా చ‌క్క‌గా న‌టిస్తున్నారు, అంతేకాదు కామెడి ముఖ్యం గా ఈ చిత్రం తెర‌కెక్కిస్తున్నాం. అని అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.