హైవేలపై నో లిక్కర్

Now liquor shops allowed on National Highways from April 1st in India

Now liquor shops allowed on National Highways from April 1st in India

జాతీయ రహదారుల వెంట మద్యం దుకాణాలు మాసేయాలనే నిబంధన ఈ రోజు నుండి అమల్లోకి వచ్చేశాయి. ఈ నిబంధనల ప్రకారం జాతీయ రహదారులకు 500 మీటర్ల దూరంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలను కూడా జారీ చేసింది. జాతీయ రహదారుల వెంట 500 మీటర్లలోపు ఉన్న మద్యం దుకాణాలు, హొటళ్లు, రెస్టారెంట్లలో మద్యం సరఫరా చేయడాన్ని కూడా నిషేధించారు.

అయితే 20 వేల కన్నా తక్కువ జనాభాగల ప్రాంతాల్లో ఈ రహదారుల నుంచి దూరాన్ని 220 మీటర్లకు తగ్గించింది. 2016 డిసెంబరు 15న భారతదేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం హైవేల నుంచి 500 మీటర్ల పరిథిలో మద్యం దుకాణాలు ఉండకూడదు. హైవేల నుంచి చూసినపుడు అవి కనిపించకూడదు.

తెలంగాణలో మద్యం దుకాణాలకు సెప్టెంబరు 30 వరకు లైసెన్సులు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 30 వరకు మద్యం దుకాణాలకు లైసెన్సులు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆ కాల పరిమితి వరకు దుకాణాలను కొనసాగించవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విధమైన లైసెన్సులు లేని మద్యం దుకాణాలను ఏప్రిల్ 1 నుంచి మూసివేయవలసి ఉంటుందని గత ఏడాది డిసెంబరు 15న ఇచ్చిన తీర్పు పేర్కొంది.

అయితే ఈ నిబంధన సిక్కిం, మేఘాలయ రాష్ట్రాలు దూరానికి సంబంధించిన నిబంధనను పాటించవలసిన అవసరం లేదు. హిమాచల్ ప్రదేశ్ 220 మీటర్ల దూరం నిబంధనను పాటించవలసి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.