బుల్లితెరపై కనువిందు చేయనున్న బుడ్డోడు

NTR Big boss Show going to shoot for 70 days in Lonavala

సిల్వర్ స్క్రీన్‌పై హిట్లు కొట్టి తమకంటూ అభిమానులను సంపాదించుకొన్న తర్వాత బుల్లితెరపై తమ ప్రతాపం చూపించడానికి రెడీ అవుతున్నారు మన హీరోలు. బుల్లితెరపై హవా కొనసాగిస్తున్న హీరోలు హీరోయిన్లతోపాటు ఇప్పటికే టాక్‌షోతో వచ్చేసిన రానాకు తోడుగా రానున్నాడు నందమూరి తారక రామారావు. హిందీలో హిట్ అయిన బిగ్‌బాస్ షోను తెలుగులో హోస్ట్ చేస్తున్న ఎన్టీఆర్ 12 మంది సెలబ్రిటీలను షోలో ముందుకు నడిపించనున్నాడు.

NTR Big boss Show going to shoot for 70 days in Lonavala

ఈ నెల 13 నుండి 70 రోజుల పాటు ముంబై సమీపంలోని లోనావాలాలో ఉన్న బిగ్ బాస్ హౌస్‌లో షూటింగ్ జ‌రుపుకోబోతున్ను ఈ కార్యక్ర‌మాన్ని జులై 16 నుండి స్టార్‌మాలో ప్ర‌సారం చేయ‌నున్నారు. ఎన్టీఆర్ హోస్ట్‌గా 12 మంది సెల‌బ్రిటీలు, 61 కెమెరాల మ‌ధ్య సెల‌బ్రిటీలు చేసే హంగామా ఆడియ‌న్స్ కి మాంచి కిక్ ఇస్తుంద‌ని అంటున్నారు.

See Also: రికార్డుల మోత మోగిస్తున్న జైలవకుశ

బిగ్‌బాస్ కార్య‌క్ర‌మం తెలుగు ఆడియ‌న్స్‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని ఎన్టీఆర్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే బిగ్‌బాస్ షోకి సంబంధించి మూడు ప్రోమోలు విడుద‌ల చేసిన టీం మ‌రో ప్రోమో విడుద‌ల చేసింది. సెల‌బ్రిటీలని క‌నిపించి క‌నిపించ‌న‌ట్టు చూపించి షోపై చాలా ఆస‌క్తి పెంచుతున్నారు నిర్వాహ‌కులు. అయితే ఈ రియాలిటీ షోలో పాల్గొనే సెలబ్రిటీలు ఎవరో కూడా ఇంకా తనకు తెలియదని ఎన్టీఆర్ చెబుతున్నాడు.

NTR Big Boss

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.