రికార్డుల మోత మోగిస్తున్న జైలవకుశ

ntr-new-movie-jai-lavakusa-satellite-rights-owned-by-gemini-tv-for-14crores

ntr-new-movie-jai-lavakusa-satellite-rights-owned-by-gemini-tv-for-14crores

ఎన్టీఆర్ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌రే కాదు.. బుల్లితెర‌పై కూడా రికార్డులు సృష్టిస్తుంటాయి. ఎన్టీఆర్ సినిమాల‌కు చిన్న‌తెర‌పై కూడా ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే సిల్వ‌ర్ స్క్రీన్ ద‌గ్గ‌ర మ్యాజిక్ చేయ‌లేక‌పోయిన ఊస‌ర‌వెల్లి, అశోక్‌లాంటి సినిమాలు ఇప్ప‌టికీ టీవీల్లో సూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలు టీవీల్లో వేసిన‌పుడు రేటింగ్స్ కూడా అదిరిపోతుంటాయి. అందుకే ఎన్టీఆర్ సినిమాల‌కు బుల్లితెర‌పై భారీ డిమాండ్ ఉంటుంది.

ఇప్పుడు కూడా ఇదే మ‌రోసారి రిపీట్ అయింది. ఎన్టీఆర్ న‌టిస్తోన్న జై ల‌వ‌కుశ సినిమాను భారీ రేట్ కు సొంతం చేసుకుంది జెమిని టీవీ. క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఈ సినిమాను ఏకంగా 14 కోట్ల‌కు కొనేసింది జెమిని ఛానెల్. ఎన్టీఆర్ గ‌త సినిమా జ‌న‌తా గ్యారేజ్ కూడా భారీ రేట్ కు అమ్ముడైంది. మొత్తానికి జూనియ‌ర్ సినిమాలు విడుద‌ల‌కు ముందే రికార్డులు సెట్ చేస్తున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.