మార్చి 17న‌ విడుదలకు రెడీ అయిన `ఓ పిల్లా నీ వ‌ల్లా` 

  O pilla nee valla releasing on March 17th
  O pilla nee valla releasing on March 17th
కిషోర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో బిగ్ విగ్ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌ నిర్మిస్తున్న‌ చిత్రం `ఓ పిల్లా నీ వ‌ల్లా`.  కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా న‌టీన‌టులు. ఇటీవ‌లే రిలీజ్ చేసిన‌ ఆడియోకి శ్రోత‌ల నుంచి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ప‌లువురు సినీప్ర‌ముఖులు ఆడియో బావుంద‌ని ప్ర‌శంసించారు. ద‌ర్శ‌క‌నిర్మాత కిషోర్ ఓ అభిరుచి గ‌ల చిత్రాన్ని తెర‌కెక్కించార‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. టాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఆవిష్క‌రించిన‌ మోష‌న్ పోస్ట‌ర్‌కి, మెస్మ‌రైజింగ్ స్టార్ శ‌ర్వానంద్ రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కి టాలీవుడ్ ప్ర‌ముఖులు స‌హా ప్రేక్ష‌కాభిమానుల నుంచి, ప‌రిశ్ర‌మ నుంచి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. పోస్ట‌ర్లు, ట్రైలర్‌ ఆస‌క్తి రేకెత్తించింద‌ని అన్నివ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లొచ్చాయి. మార్చి 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.
చిత్ర ద‌ర్శ‌క నిర్మాత కిషోర్ మాట్లాడుతూ  `ఓ పిల్లా నీ వ‌ల్లా.. చ‌క్క‌ని వినోదాత్మ‌క చిత్రం. ల‌వ్‌, కామెడీ -యాక్ష‌న్ హైలైట్‌గా ఉంటాయి. అన్ని వ‌ర్గాల్ని మెప్పించే చిత్ర‌మిది. పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ల‌కి చ‌క్క‌ని స్ప ంద‌న వ‌చ్చింది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఆడియో శ్రోత‌ల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మార్చి 17న రిలీజ్ చేస్తున్నాం. మాస్‌, క్లాస్‌, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అంద‌రినీ ఆక‌ట్టుకునే చిత్ర‌మిది“ అన్నారు.
కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా, సూర్య శ్రీనివాస్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సాహిత్యంః కృష్ణ మ‌దినేని, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, కోరియేగ్రాఫర్ :జీతెంద్ర యాక్ష‌న్ః మార్ష‌ల్ ర‌మ‌ణ‌, సినిమాటోగ్ర‌ఫీః షోయబ్ అహ్మ‌ద్ కె.ఎం., ఎడిట‌ర్ః అనిల్ కింతాడ సహా నిర్మాత : మౌర్యా సంగీతంః మ‌ధు పొన్నాస్‌, నిర్మాతః కిషోర్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః కిషోర్‌.

Have something to add? Share it in the comments

Your email address will not be published.