హ్యాపీ హోమ్స్‌లో ఏం జరుగుతోంది??

octopus team searches for terrorists in Muthoot happy homes upparpally

ప్రశాంతంగా ఉన్న ఏరియాలో ఎప్పుడూ కనిపించనంత మంది పోలీసులు… ఎవరైనా వీఐపీలు వస్తున్నారా…. అసలు హైదరాబాద్‌ ఉప్పరపల్లిలో ఏం జరుగుతోంది??? ఇంతమంది పోలీసులకు అక్కడ ఏం పని??

octopus team searches for terrorists in Muthoot happy homes upparpally

అసలు విషయం ఏంటంటే ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థలో దోపిడీకి పాల్పడిన దొంగల కోసం తనిఖీలు ప్రారంభించిన పోలీసులు రాజేంద్రనగర్‌ పరిధిలోని ఉప్పరపల్లిలో దొంగలు వాడిన టవేరా వాహనాన్ని గుర్తించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ మైలార్‌దేవరపల్లి ముత్తూట్ ఫైనాన్స్‌లో దుండగులు దోపిడీకి విఫలయత‍్నం చేశారు. కత్తి, తుపాకీతో ముత్తూట్‌ కార్యాలయంలోకి వచ్చిన దుండగులు సిబ‍్బందిని బెదిరించారు. అప్రమత‍్తమైన ముత్తూట్ అసిస్టెంట్ మేనేజర్ లతీఫ్ అలారం నొక్కడంతో స్థానికులు రావడంతో దుండగులు పరారయ్యారు.

ఆ తర్వాత పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా దొంగలు వాడిన టవేరా వాహనంలో దొంగలు సోమవారం మద్యాహ్నం ఔటర్‌ రింగ్‌‌రోడ్డుపై శంషాబాద్‌ టోల్‌‌గేటు దగ్గర టోల్‌ చెల్లించినట్లు గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగా వారికోసం గాలింపులు ప్రారంభించిన పోలీసులు ఉప్పరపల్లిలో దొంగలు ఉన్నారని భావిస్తున్న హ్యాపీ హోమ్స్‌ అపార్ట్‌మెంట్‌ వద్దకు చేరుకున్నారు.

See Also: ప్రభుత్వానికి ఆదాయం వస్తే విషం కూడా హెల్తీ డ్రింకే..

దాదాపు 50 మంది ఎస్సైలు, 10 మంది సీఐలు, నలుగురు ఏసీపీలు, ఒక డీఎస్పీ సహా 300 మంది పోలీసులు హ్యాపీ హోమ్స్ ప్రాంతంలో నిందితులను పట్టుకొనేందుకు చేరుకున్నారు. అంతేగాక కౌంటర్ టెర్రరిజానికి వాడే ఆక్టోపస్ బలగాలను సైతం రంగంలోకి దింపడంతో అక్కడున్నది దొంగలేనా లేక ఉగ్రవాదులు ఉన్నట్లు ఏదైనా సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిందా అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 100 మందికి పైగా ఆక్టోపస్‌ బలగాలు భారీ ఎత్తున ఆయుధాలతో చేరుకుని 450 ఫ్లాట్ల తనిఖీని ప్రారంభించాయి.

దొంగల కోసం ఆక్టోపస్‌ బలగాలను ఎందుకు రప్పిస్తున్నారన్న విషయంపై పోలీసులు క్లారిటీ ఇవ్వట్లేదు. దీంతో కేవలం దొంగలు మాత్రమే కాకుండా అపార్ట్‌మెంట్‌లో ఇంకేదో కీలకమైన విషయం ఉంటుందని అక్కడికి చేరుకున్న వాళ్ళందరూ భావిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఇండియన్‌ మొజాహిద్దీన్‌కు చెందిన టెర్రరిస్టులు బ్యాంకు దోపిడికి యత్నించిన నేపథ్యంలో ప్రస్తుతం కూడా అదే తరహా దోపిడీ యత్నం జరిగిన నేపథ్యంలో పోలీసులు వారిని ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే వారి వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయోనని పోలీసులు ముందు జాగ్రత్తగా తాము చుట్టుముట్టిన అపార్ట్‌మెంట్‌ వద్ద దాదాపు 200మంది పోలీసులను మోహరించారు.

See Also: వర్మ ఇప్పుడేం వివాదాలు బయటపెడ్తాడో..!

Have something to add? Share it in the comments

Your email address will not be published.