తెలంగాణలో ఆయిల్ ఫాం పరిశ్రమ

Oil Farm factory Trail run today in Telangana Bhadradri district

Oil Farm factory Trail run today in Telangana Bhadradri district

తెలంగాణా రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లాలో అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో ఆయిల్ ఫాం సాగును రైతులు పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని నిర్మిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు రైతులకు హామీ ఇచ్చారు. మంత్రి తుమ్మల సొంత ఊరు అయిన దమ్మపేట మండలంలోని గండుగులపల్లి గ్రామం చుట్టుపక్కల పెద్దఎత్తున ఆయిల్ ఫాం సాగు ఉంది. వీటన్నింటి దృష్టిలో ఉంచుకొని ఫ్యాక్టరీ  నిర్మాణానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వ్యవసాయశాఖామంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో శంఖుస్థాపన చేసిన  ఆయిల్ ఫాం పరిశ్రమ రెడీ అయ్యింది. ఇవాళ అధికారికంగా ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ప్రముఖ స్థానంలో ఉన్న తెలంగాణలో ఇప్పుడు ఆయిల్ ఫాం అభివృద్ధి చేసేందుకు దృష్టి పెట్టింది ప్రభుత్వం.

ఉమ్మడి ఏపీలో ఆంధ్రా ప్రాంతంలో ఆయిల్ ఫాం సాగు ఎక్కువగా ఉండేది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 12వేల హెక్టార్లలో సాగవుతోంది. ఫలితంగా గంటకు 30టన్నుల సామర్థ్యం కలిగిన పామాయిల్ ఫ్యాక్టరీ ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా అప్పారావుపేటలో 74కోట్ల వ్యయంతో.. 41ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాట్లు చేపట్టారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.