జలీల్‌ఖాన్‌కు తమ్ముడు దొరికాడు……

On Ambedkar Jayanti, AP minister Nara Lokesh tongue slip and greeted audience on Babasahebs death anniversary
On Ambedkar Jayanti, AP minister Nara Lokesh tongue slip and greeted audience on Babasahebs death anniversary

బీకాంలో ఫిజిక్స్ కాదు…. జయంతి బాబూ.. వర్ధంతి కాదు

సోషల్ మీడియా పుణ్యమా అని ఫేమస్ అయిన రాజకీయనాయకుల్లో ఎపిలో ముందు వరుసనలో ఉంటారు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. 2014 ఎన్నికల్లో వైఎస్సాఆర్సీపీ నుండి గెలుపొంది అధికార టీడీపీలోకి చేరిన ఈయన ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో అడ్డంగా బుక్ అయి రాత్రిక రాత్రే ప్రపంచం మొత్తం తన ఘనత చాటుకున్నారు. బీకాంలో ఫిజిక్స్ చదివిన జలీల్ ఖాన్‌కు ఇప్పుడు తోడు దొరికింది. ఆ తోడు ఎవరో కాదు కొత్తగాఆంధ్రప్రదేశ్‌ పంచాయితీరాజ్ ఐటీశాఖామంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు ముద్దుల తనయుడు నారా లోకేష్.

నారాలోకేష్ కూడా బీకాంలో ఫిజిక్స్ చదివారని అనుకుంటున్నారా… అదేం లేదు… లోకేష్ జలీల్ ఖాన్ మాదిరిగా బీకాంలో ఫిజిక్స్ చదవలేదు కానీ అయ్యగారికి జయంతి అంటే ఏంటో వర్ధంతి అంటే ఏంటో కూడా తెలిసినట్లుగా లేదు. ఎందుకంటే ఫారిన్‌లో చదువుకొని వచ్చిన చినబాబుకి జయంతికి వర్థంతికి తేడా తెలియదు కాబట్టి. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా లోకేష్ ప్రసంగంతో నారా లోకేష్ మరోసారి  నవ్వులపాలయ్యారు.

అంబేద్కర్ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన నారా లోకేష్‌ ఇంకా పూర్తిస్థాయి రాజకీయ ప్రసంగాలకు సిద్ధంకాలేదని అర్థమైపోతోంది. గతంలో ఎన్నికల సమయంలో జరిగిన ప్రచార సభలో సొంత పార్టీనే ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేశారు లోకేష్. అవినీతి, కుల పిచ్చి, మతపిచ్చి ఉన్న ఏకైక పార్టీ టీడీపీయే అవునా కాదా తమ్ముళ్లూ అంటూ కార్యకర్తలను అడిగి పరువు తీసుకున్న నారా లోకేష్… ఇప్పుడు అంతకంటే పెద్ద పొరపాటు చేసి మళ్ళీ నవ్వులపాలయ్యారు. అంబేద్కర్ జయంతిని వర్ధంతిగా మార్చేసి ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు అంటూ ప్రసంగించిన లోకేష్‌కు అక్కడి వచ్చినవారందరూ బాబూ వర్థంతికాదు జయంతి అని అరవడంతో తప్పు తెలుసుకొని సారీ చెప్పారు.

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడు కూడా ఇలానే తప్పులతో మాట్లాడి పరువు తీసుకున్న లోకేష్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు పిచ్చిపిచ్చిగా వేస్తున్నారు. ఇదే అదునుగా ప్రతిపక్ష నాయకులు కూడా లోకేష్‌పై కామెంట్లు చూస్తూనే ఉన్నారు. తెలుగు సరిగ్గా మాట్లాడడంరాని మంత్రి అంటూ దెప్పిపొడుస్తున్నారు. అంతేగాక సోషల్ మీడియాలో జలీల్ ఖాన్ మాదిరిగా నారా లోకేష్ కూడా బీకాంలో ఫిజిక్స్ చదివారా … జలీల్ ఖాన్‌కు తెలుగు తమ్ముడు దిొరికాడంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు నెటిజన్లు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.