కూకట్‌పల్లిలో టిప్పర్ బీభత్సం

హైదరాబాద్ మూసాపేట ఐడీయల్‌‌వద్ద ఓ డీసీఎం  ఉదయం బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న డీసీఎం  అదుపుతప్పి మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోగా మరో ఐదుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. డీసీఎం సృష్టించిన బీభత్సం గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనకు పాల్పడ్డ  డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బ్రేకులు ఫెయిలైనందు వల్ల ఈ ఘటన జరిగిందాలేక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా అన్నదానిపై విచారణ జరుపుతున్నారు పోలీసులు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.