ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో ఎదురుకాల్పులు

One Maoist killed in ambush on Andhra-Odisha Border

One Maoist killed in ambush on Andhra-Odisha Border

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో మళ్ళీ ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఈమధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ తర్వాత అంతా సద్దుమణిగిందనుకొనే సమయంలో ఆంధ్రా ఒడిశ్శా సరిహద్దుల్లో కోరాపుట్ జిల్లా నారాయణపట్నం సమీపంలోని లల్లేరి అటవీప్రాంతంలో మరోసారి కాల్పులమోత మోగింది. భద్రతా సిబ్బంది మావోల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక మావోయిస్టు మ‌తి చెందగా, ఒక గిరిజనుడు తీవ్రంగా గాయపడ్డాడు.

సుమారు 30 నిమిషాలపాటు జరిగిన ఎదురుకాల్పుల తర్వాత మావోయిస్టులు చాలామంది పరారయ్యారని భద్రతా సిబ్బంది చెబుతున్నారు. అయితే పోలీసులకు, మావోలకు మధ్య మాటిమాటికి జరుగుతున్న కాల్పులు దాడులు, ప్రతిదాడులతో గిరిజనులు గజ గజ వణుకుతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందన్న దానిపై ఆందోళన చెందుతున్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.