పంటభూమిలో భవనాలు కడితే…

One rain slashes down the International Capital image of Amaravathi

One rain slashes down the International Capital image of Amaravathi

నైరుతి రుతుపవనాలేవో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చతెచ్చేటట్లు కనిపిస్తున్నాయి. ప్రపంచ స్థాయి అత్యాధునిక రాజధానిని నిర్మిస్తున్నామంటూ చంద్రబాబు చెప్పుకొస్తున్న మాటలన్నీ ఒక్క వర్షానికే నీటి మూటలుగా మారాయి. అమరావతిలో కురిసిన చిన్నపాటి వర్షానికే ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాల్లోకి నీరు చేరడంతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడింది. కేవలం 20 నిమిషాలపాటు కురిసిన సాధారణ వర్షానికే అసెంబ్లీ, సచివాలయం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ ప్రాంతమంతా బురదమయంగా మారింది.

నిన్నటి వర్షంతో చాంబర్లు మడుగులను తలపిస్తున్నాయి. ఛాంబర్లలోని ఫైళ్లు, సోఫాలు, కుర్చీలు అన్నీ తడిసిపోయాయి. పాత ఇళ్ళలో వర్షం పడుతుంటే నీటి ధార క్రింద పడకుండా ఎలాగైతే బకెట్లు పెడతారో సేమ్ అలాంటి పరిస్థితే కొత్తగా నిర్మించిన అసెంబ్లీ, సచివాలయంలో ఏర్పడింది. నూతన అసెంబ్లీ, సచివాలయంలో లీకేజీలు బహిర్గతం కావడంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరోవైపు నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి అసెంబ్లీలోని వైఎస్సాఆర్‌సీఎల్పీ కార్యాలయంలో ఫాల్స్ సీలింగ్‌కు చిల్లులుపడి కురుస్తుండటంపై ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు నిజనిర్ధారణకు సిద్ధమయ్యారు. అయితే మీడియాతో కలిసి అసెంబ్లీ భవనాన్ని పరిశీలించడానికి ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నించడంతో మీడియా ప్రతినిధులను అసెంబ్లీలోకి అనుమతించడానికి మార్షల్స్‌ నిరాకరించారు.

అయితే తమతోపాటు మీడియాను అనుమతించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు వద్ద ఆందోళనకు దిగారు. తమకిష్టమైన ప్రైవేట్‌ సంస్థలకు వందల కోట్ల రూపాయలు ధారపోసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రాష్ట్ర నూతన శాసనసభ, సచివాలయం చిన్నపాటి వర్షానికే కురవడంపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలకు నిజానిజాలు తెలియాల్సిన అవసరముందని, ఇందుకు అసెంబ్లీ భవనాన్ని పరిశీలించడానికి మీడియా ప్రతినిధులకు కూడా అవకాశం ఇవ్వాలని వారు కోరారు. అయితే మార్షల్స్‌తో  కొద్దిసేపు వాగ్వివాదం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు కొంచంసేపు నిరసన తెలిపి ధర్నాను ముగించారు.

అయితే ప్రభుత్వం పరువు పోయే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. వర్షానికి లీకేజీలు అయ్యే విషయం బయటకు పొక్కకుండా మీడియా ప్రతినిధులను అసెంబ్లీ, సచివాలయం వైపు వెళ్లనివ్వకుండా అడ్డుకుంది. అంతేగాక వర్షపు నీటి లీకేజీల దృశ్యాలను చిత్రీకరించవద్దని భద్రతా సిబ్బంది హెచ్చరించారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.  • Nageswar Yelleti says:

    Idi intidongalu , rashtra paruvu Manta galipe vari kutta. Nirmana lopam kaadu.

  • Madhu says:

    Eppudu Chandrababu midha bhurada challadam kosam chustaru