స్వచ్ఛత సర్వే మాకొద్దు అంటున్న ఓ రాష్ట్రం

one-state-government-boycotted-the-central-government-swacha-sarvekshan-2017

one-state-government-boycotted-the-central-government-swacha-sarvekshan-2017

దేశం మొత్తం గత కొన్ని నెలలుగా అన్ని నగరాల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలను నిర్వహించింది. అందులోభాగంగా కేంద్రప్రభుత్వం ఏ నగరాలు స్వచ్ఛభారత్ అభియాన్‌ను సరిగ్గా పాటిస్తున్నాయో లేదో పర్యవేక్షించారు. సర్వే వివరాలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విడుదల చేశారు. ఈ సర్వేలో దాదాపు లక్ష మందికి పైగా జనాభా ఉన్న 500 నగరాలు పాల్గొన్నాయి. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్వచ్ఛభారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌-2017 పేరుతో సర్వే నిర్వహించి 434 నగరాలకు ర్యాంకులను ఇచ్చారు. ఇందులో అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నిలవగా, చెత్త నగరంగా ఉత్తరప్రదేశ్‌లోని గోండా నిలిచింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌తోపాటు గుజ‌రాత్‌, ఏపీ, తెలంగాణా, జార్ఖండ్‌లోని న‌గ‌రాలు ఈ జాబితాలో మెరుగైన ర్యాంకులు సాధించాయి. ఇక‌ అత్యంత చెత్త న‌గ‌రాల్లో 25 ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనే ఉన్నాయి. అయితే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దాదాపు అన్ని రాష్ట్రాలు పాల్గొన్నప్పటికీ ఒక్క రాష్ట్రం మాత్రం కేంద్రం సర్వేను బాయ్‌కాట్ చేసింది. స్వచ్ఛత సర్వే మాకొద్దు అని ఆ రాష్ట్రం చెప్పేసింది. ఆ రాష్ట్రం వేరే ఏదో కాదు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పశ్చిమ్‌బంగా మాత్రం ఈ సర్వేలో పాల్గొనలేదు.

పశ్చిమ్‌బెంగాల్‌లో మొత్తం 60 నగరాలు ఉన్నాయి.. కానీ అవేమి ఈ సర్వేలో పాల్గొనలేదట. బహిరంగ మలవిసర్జనన నిర్మూలించేందుకు పశ్చిమ్‌బెంగాల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ‘మిషన్‌ నిర్మల్‌ బంగ్లా’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందువల్లే ఈ సర్వేలో పాల్గొనలేదని అధికారులు అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్టణానికి మూడో ర్యాంకు రాగా, తెలంగాణలోని హైదరాబాద్‌ నగరం మాత్రం 22వ స్థానంలో నిలిచింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.