మనకు ఆస్కార్లు ఏవి

లాస్ ఏంజిల్స్ లో ఘనంగా జరిగిన 89వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఇండియన్ సినిమాకు ఎప్పటిలాగే నిరాశనే మిగిల్చింది. భారతీయ సినిమాలేవీ  కనీసం నామినేషన్ కు కూడా నోచుకోలేదు. ఆస్కార్ చరిత్రను చూస్తే మనకు నామినేషన్ దక్కిన సందర్భాలు కూడా చాలా తక్కువ. కొంతకాలం కిందట ఏఆర్ రెహమాన్ కు ఆస్కార్ లభించడం మినహా  .. .. అంతకు మించి మన భారతీయ సినిమాకు ఆస్కార్ కు  అవకాశమే లేకుండా పోయింది. కనీసం ఆనవాళ్లూ లేవు.

ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్ మన భారతీయ సినిమాకు ఎప్పుడూ ఆమడ దూరంలోనే ఉంటోంది.  మనకు మంచి సినిమాలు తీసే దర్శకులున్నారు. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులూ ఉన్నారు. ఉదాహరణకు ఆమిర్ ఖాన్ తీసిన సినిమాలు  ప్రపంచస్థాయి సినిమాలకు  ఏ మాత్రం తీసిపోవు. ఈసారి లగాన్ కు కనీసం నామినేషన్ వస్తుందనుకున్నారు. కానీ ఆస్కార్ పెద్దల దృష్టికి వెళ్లలేదు. అలాగే పింక్ కూడా మంచి సినిమా. అది కూడా వేదిక వెనకే ఉండిపోయింది.

మన సినిమాలు ఆస్కార్ దృష్టికి ఆనడం లేదు. గుర్తింపూ లేదు. అసలు భారతీయ సినిమా అంటేనే ఆస్కార్ అకాడెమీ చిన్నచూపు చూస్తోందా అనిపిస్తుంది. ఆస్కార్ అవార్డ్ అందుకునే స్థాయి మన సినిమాలకు లేదని వారి ఒపీనియన్ గా కనిపిస్తోంది. మనం కొన్ని సినిమాల్లో హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొడుతున్నామనే విమర్శ కూడా ఉంది. అయితే మంచి సినిమాలూ  గుర్తింపునకు నోచుకోవడం లేదు. ఆస్కార్ అవార్డ్ లు అమెరికా సినిమాలకే  అనే విమర్శకూడా ఉంది.

ఇక 2016 ఆస్కార్ విజేతల జాబితాను చూస్తే .. .. ఎక్కువ అవార్డులు లా లా లాండ్ కే వచ్చాయి. కేటగరీల వారీగా విజేతలెవరో చూద్దాం. ఉత్తమ చిత్రం: మూన్ లైట్. ఉత్తమ నటుడు: కేసీ అఫ్లెక్(మాంచెస్టర్ బై ద సీ). ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్(లా లా లాండ్). ఉత్తమ దర్శకుడు: డామీన్ చాజెల్లె (లా లా లాండ్). ఉత్తమ సహాయ నటుడు: మహేర్షాల అలీ(మూన్‌లైట్‌). ఉత్తమ సహాయ నటి: వయోలా డేవిస్‌(ఫెన్సెస్‌). ఉత్తమ మేకప్‌ మరియు హెయిర్‌ స్టైల్‌: సూసైడ్ స్క్వాడ్‌ చిత్రం. ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ చిత్రం: ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌ . ఉత్తమ డాక్యుమెంటరీ: ఓ.జే.. మేడ్‌ ఇన్‌ అమెరికా. ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌: అరైవల్‌ అవార్డ్ దక్కించుకుంది.

ఇక ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్ చిత్రం‌గా హాక్సారిడ్జ్‌ నిలిచింది. ఉత్తమ ఫిల్మ్‌ ఎడిటింగ్‌: హాక్సారిడ్జ్‌. ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ద సెల్స్‑మ్యాన్‌(ఇరాన్‌). బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌: జూటోపియా. బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌: పైపర్‌. ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ చిత్రం: లా లా ల్యాండ్‌. బెస్ట్‌ విజువల్ ఎఫెక్ట్స్‌: ద జంగిల్‌ బుక్‌. బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌: ద వైట్‌ హెల్మెట్స్‌. బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌: సింగ్‌. బెస్ట్‌ సినిమాటోగ్రఫి: లా లా ల్యాండ్‌.  బెస్ట్ ఒరిజినల్ స్కోర్: లా లా లాండ్. బెస్ట్ ఒరిజినల్ సాంగ్: సిటీ ఆఫ్ స్టార్స్( లా లా లాండ్). బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే : మాంచెస్టర్ బై ద సీ. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: మూన్ లైట్ .

Have something to add? Share it in the comments

Your email address will not be published.