పాకిస్తాన్ సరిహద్దులు మూసేస్తాం: రాజ్‌నాథ్‌సింగ్

our-target-to-close-india-pakistan-international-borders-by-2018-says-rajnath-singh

our-target-to-close-india-pakistan-international-borders-by-2018-says-rajnath-singh

ఒక్కొక్కసారి మనోళ్ళు తీసుకొనే నిర్ణయాలు దేశ భవిష్యత్తుపై ఆధారపడి ఉంటాయి. అందుకే కొన్ని విషయాల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా ఆలోచించి తీసుకుంటారు. ప్రస్తుతం దేశ భవిష్యత్తకు సంబంధించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరడేందుకు వీలుగా కేంద్రం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు చొరబాట్లు తగ్గించుకొనే రకంగా భారత్- పాక్ సరిహద్దులను వీలైనంత త్వరగా మూసివేసేందుకు చర్యలు మొదలుపెట్టామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 2018 డిసెంబరు నాటికి పూర్తిగా కట్టుదిట్టం చేస్తామని,  అనుకున్న సమయానికి దీన్ని పూర్తిచేయడానికి చర్యలు మొదలు పెడతామని ఆయన అన్నారు.

గతేడాది పాకిస్థాన్ సరిహద్దుల్లోని నాలుగు రాష్ట్రాల భద్రత సమీక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం కఠినమైన ప్రాంతాల్లో సాంకేతిక ప‌రిఙ్ఞానాన్ని వినియోగించి లోపాలను సవరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారత్- పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు క్రమేపీ పెరుగుతున్నాయి, సైనికులపై విశ్వాసం ఉండాలి తప్ప, దేశ రక్షణను పణంగా పెట్టరాదని కేంద్ర హోంమంత్రి తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని తేకన్‌పూర్‌ సరిహద్దు భద్రతా దళాల(బీఎస్‌ఎఫ్‌) అకాడమీలో జరిగిన పాసింగ్‌అవుట్‌ పరేడ్‌లో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దులను వీలైనంత త్వరగా మూసివేసేందుకు భారత్‌ చర్యలు చేపడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు.

పాక్‌ ఉగ్రవాదంతో భారత్‌ ఒక్కటే ఇబ్బందులు ఎదుర్కొవడం లేదన్నారు. పొరుగుదేశాలపై వాటి ప్రభావం పడుతోందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి గోపాల్‌ భగ్లే వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.