కొనసాగుతున్న సీబీఐ దాడులు

P Chidambaram son Kaarthi raided by CBI over Aircel Maxis deals

P Chidambaram son Kaarthi raided by CBI over Aircel Maxis deals

గత కొన్ని రోజులుగా దేశంలో ప్రముఖ ఆఫీసులు, ఇళ్ళపై ఆదాయపు పన్నుశాఖ, సీబీఐ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కేంద్ర మాజీ కేంద్ర హోంశాఖామంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో చిదంబరం, ఆయన తనయుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసులో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, ఐటీశాఖ పలుసార్లు చిదంబరం నివాసాలపై దాడులు చేపట్టింది. 2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్ సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందానికి అనుమతించారని బీజేపీ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసులో చిదంబరం పాత్రపై నివేదిక కూడా రూపొందిస్తున్నట్లు ఇటీవల ఐటీ శాఖ సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో ఈ కేసులో చిదంబరంపై విచారణ చేపట్టాల్సిందిగా సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో సీబీఐ ఈరోజు చిదంబరం కుటుంబానికి చెందిన పదహారు చోట్ల సోదాలు చేపట్టింది.

మరోవైపు సుమారు వెయ్యి కోట్ల విలువైన అక్రమ భూఒప్పందం జరిగిందనే ఆరోపణలు రావటంతో,  ఢిల్లీ, గూర్గావ్‌ తో పాటు సుమారు 22 ప్రాంతాల్లో ఏకకాలంలో ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్‌ యాదవ్‌ నివాసాలపై ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఆ తర్వాత ఈరోజు ఉదయం నుండి ఆయనతో సంబంధం ఉన్న ‍ప్రముఖ వ్యాపార వేత్తల రియల్‌ ఎస్టేట్‌ ఏంజెట్లపై అధికారులు దాడులు చేశారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ‘క్విడ్‌ ప్రో కో’ కు పాల్పడ్డారని కేంద్రమంత్రి రవిశంకర్‌ ఆరోపించారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.