పోర్చుగల్‌లో ‘పైసా వసూల్’ పూర్తి

Paisa Vasool team Heading back from Portugal after massive schedule of 40days

నందమూరి బాలకృష్ణ ,పూరిజగన్నాధ్ ల  సెన్సేషనల్ కాంబినేషన్ లో భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘పైసా వసూల్‘. ఈ చిత్రానికి సంబంధించి పోర్చుగల్‌లో 40రోజుల భారీ షెడ్యూల్‌ని పూర్తి చేసుకొని సినిమా యూనిట్ హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అయ్యారు.

Paisa Vasool team Heading back from Portugal after massive schedule of 40days

ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాధ్, నిర్మాత వి. ఆనంద్ ప్రసాద్  మాట్లాడుతూ ” పోర్చుగల్‌లో 40 రోజులపాటు భారీ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాం. పోర్చుగల్‌లోని లిస్బన్ , పోర్టో  సిటీల్లో ఇంతవరకు ఎవరు చెయ్యని లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. పైసా వసూల్ అనే టైటిల్ ఈ కథ కు యాప్ట్. కచ్చితం గా బాలకృష్ణ గారి ఫాన్స్, ఆడియన్స్ ఫుల్ ఖుష్  అయ్యేలా ఈ సినిమా ఉంటుంది.

బాలకృష్ణ గారితో పని చేస్తున్నందుకు  చాలా చాలా హ్యాపీ గా వుంది. ఈ సినిమాలో ఆయన చాలా స్టైలిష్ గా కనిపిస్తారు. ఆయన డైలాగ్స్, యాక్షన్  ఎపిసోడ్స్ ఫెంటాస్టిక్ గా ఉంటాయి. ఈ మధ్య కాలం లో బాలకృష్ణ గారు సీరియస్ టైపు రోల్స్ చేస్తున్నారు.  ఇందులో మాత్రం ఎంటర్టైన్మెంట్ రోల్ చేస్తున్నారు. నిజం గా అభిమానులకి పండుగే ఈ సినిమా.యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కొన్నియాక్షన్  ఎపిసోడ్స్ లో ఫారిన్ సాంకేతిక నిపుణులు  మరియు ఫైట్ మాస్టర్స్ పని చేసారు. ” అని తెలిపారు.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.