ప్రభుత్వానికి భజన చేయమని ఎవరూ అడగలేదు

Parakala Prabhakar fires on IYR Krishnarao on his allegations

సోషల్ మీడియాలో పోస్టులతో వివాదాస్పదంగా మారిన సీనియర్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ క‌ృష్ణారావు వ్యవహారంలో ప్రభుత్వం తరుపున ఆయనను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్. ఆరు నెలలు తిరిగితేకానీ ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ దొరకలేదని, ఫేస్‌బుక్‌లో పోస్టులకు సంబంధించి అంతా తన వ్యక్తిగతమని ఐవైఆర్ మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత పరకాల మీడియాతో మాట్లాడారు.

Parakala Prabhakar fires on IYR Krishnarao on his allegations

పరకాల ప్రభాకర్ మాటల్లోనే… ‘ కృష్ణారావు గారంటే సీఎం చంద్రబాబుకు, మాకు చాలా గౌరవం.. వారు సుమారు 3 దశాబ్ధాలు ఉన్నతాధికారిగా ఈ రాష్ట్రానికి సేవ చేశారు.. ఈ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో నేను స్వయంగా చెప్పాను.. వారు పదవి విరమణ చేసేపట్పటికీ సీఎంగారు స్వయంగా పిలిచి ఈ రాష్ట్రానికి మీ సేవలు కావాలి మీరు ప్రభుత్వంలో ఏదో ఒక బాధ్యత తీసుకుంటే బాగుంటుందని బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని ఆయన అడిగితే ఇచ్చారు.. సీఎంను కలవడానికి చాలా ప్రయత్నం చేశాను కుదరలేదనే మాట అన్నారు.. సీఎంగారిని కృష్ణారావు కలవడానికి ఎప్పుడు స్వేచ్ఛ ఉండేది.. మేమందరం గదిలో ఉన్నా ఆయన వస్తే మేము లేచి వెళ్లిపోతాం.. మొన్న మేలో జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కృష్ణారావు ముఖ్యమంత్రి గారిని కలిశారు.. ఏప్రిల్‌లో కలిశారు, మార్చిలో కలిశారు.. అందులో పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.’

“ప్రభుత్వంలో ఉన్న అందరికి పద్దతులు, కట్టుబాట్లు ఉంటాయి.. ఆ కట్టుబాట్లకి లోబడి ఆ పద్ధతుల్ని అనుసరించి మనం మాట్లాడాలి, ప్రవర్తించాలి.. ఈ విషయాన్ని సుమారు మూడు దశాబ్ధాల పాటు ఉన్నత సర్వీస్ లో పని చేసినవారికి మనం చెప్పాల్సిన పని లేదు.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది.. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి.. ప్రభుత్వ విధానాల్ని, నిర్ణయాల్ని బహిరంగంగా విమర్శించడం ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలి.. వారి కార్పేరేషన్ లోనే వారితో పని చేసేవారు సోషల్ మీడియాలో బయటివారికి చెబితే వారికి కూడా రుచించదనే అనుకుంటున్నాను.. ఇది ప్రభుత్వం దృష్టిలో అత్యంత అభ్యంతరకరం.. అంత అనుభవజ్ఞులైన కృష్ణారావు ద్వారా మేము ఊహించినది కాదు.’

See Also: చంద్రబాబు అంత బిజీనా??

‘ఉన్నతమైన బాధ్యతలో ఉన్నవారు కొత్త కార్పొరేషన్, బ్రాహ్మణుల వారి సంక్షేమం గురించి దేశంలోనే మొట్టమొదటి సారి ఈ కార్పొరేషన్ ను సీఎం చంద్రబాబు గారు పెట్టారు.. ప్రభుత్వానికి భజన చేయమని ఎవర్వు అడగలేదు, అడగరు కూడా.. ముఖ్యమంత్రి కమిట్ మెంట్ కు అనుగుణంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెద్దవారైన కృష్ణారావుకు బాధ్యలిచ్చి సమాజానికి చేదోడు వాడోదుగా ఉండాలని మంచి పథకాలను అమలు చేస్తున్నాం.. బ్రాహ్మణులను పరిశ్రమల ఏర్పాటు చేసే విధంగా, సంక్షేమం కోసం, చదువు కోసం పథకాలు ఉన్నాయి.. ప్రభుత్వానికి, శాసనసభకు, శాసనమండలికి వ్యతిరేకంగా, దళిత ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వారిని అసభ్యకరంగా చూపిస్తూ పెట్టిన సోషల్ మీడియా పోస్టుల్ని వాటికి ప్రభుత్వం నుంచి అభ్యంతరం చెప్పింది.. మనం ప్రజా స్వామ్యంలో ఉన్నామా ఫ్యాసిజంలో ఉన్నామా అనే మాట కొంచం విపరీతంగా కనబడుతోంది.. నాకు ఈ మాటలు ఔచిచ్ఛంతో కూడిన మాటలు కావు.’

See Also: చంద్ర’బాబా’ మజాకా???

‘వ్యక్తిగతంగా కార్పొరేషన్ పథకాలను ముందుకు తీసుకువెళ్లడానికి కృష్ణారావు ఎవరినైనా కలవవచ్చు.. సీఎం పలానవారిని కలిస్తే తప్పులేదు కాని నేను పలాన వారిని కలిస్తే తప్పా అనడం కరెక్ట్ కాదు.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో చిన్న చిన్న లోపాలు ఉంటే సీఎం గారికో ఇతరులకో వారి మనసులో ఉన్న మాట చెప్పోచ్చు.. అవి పరిశీలించిన అనంతరం ఆమోదయోగ్యంగా ఉంటే ప్రభుత్వం స్వీకరిస్తుంది.. మనకున్న ముఖ్య బాధ్యత కొత్త కార్పొరేషన్, కొత్త రాష్ట్రం దీనికి సరైన స్వరూపాన్ని ఇచ్చి ఉన్నటువంటి నిధులను మరింత ప్రభావవంతంగా ఖర్చు పెట్టే విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత.. ఇది ఇలా ఉంటే సినిమా గురించో, టీడీడీ గురించో, సోషల్ మీడియా గురించో పెద్దగా వెళ్లాల్సిన అవసరం నాకైతే కనిపించలేదు.. ప్రభుత్వం ఏదో తప్పు చేస్తోంది అక్కడున్న విషయాలు జనానికి సరిగా తెలియడం లేదు.. అనే విపరీతమైన వ్యాఖ్యలు చేయాల్సిన సందర్భంకాదని మేము అనుకుంటున్నాం.’ అంటూ తన మీడియా సమావేశాన్ని ముగించారు పరకాల ప్రభాకర్.

See Also: దిగుమతి చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలి: కెసిఆర్

Have something to add? Share it in the comments

Your email address will not be published.