3న పవన్ శ్రీకాకుళం సభ

pawan-conducting-a-public-meeting-on-january-3rd-at-srikakulam

విజయవాడ: ప్రశ్నించడానికి పార్టీ అనే కొత్తనినాదంతో వచ్చిన పవన్ కల్యాణ్ తన రాజకీయ ఎత్తుగడలను చురుగ్గా వేస్తున్నాడు. మొన్నటి వరకు ఐదు ప్రశ్నలతో కేంద్రంపైనా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనా  ప్రశ్నల బాణాలు సంధించిన పవర్ స్టార్ అడుగులు వేగంగా వేస్తున్నాడు. తిరుపతి, కాకినాడ సభలతో రాజకీయాల్లో కదలికలు తెచ్చిన జనసేన అధ్యక్షుడు మరో బహిరంగ సభకు సిద్దమయ్యాడు.

నవ్యాంధ్రకు కేంద్రం చేసిన అన్యాయంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ బహిరంగ సభలు పెట్టి చాలాసార్లు ప్రశ్నించిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా మరో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు తిరుపతి, అనంతపురం, కాకినాడ లో భారీ బహిరంగ సభలు పెట్టి కేంద్రంపై దుమ్మెత్తిపోసిన జనసేనాని, ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు దృష్టి సారించారు. ఇందులో భాగంగా జనవరి 3న ఆయన శ్రీకాకుళంలో పర్యటించనున్నారు.

జనవరి 3న ఉదయం 10 గంటలకు జరగనున్న భారీ బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగిస్తారు. తాజాగా పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా సోమవారం ఆంధ్రప్రదేశ్ కు 1981 కోట్లను కేంద్రం విడుదల చేసిన విషయం తెల్సిందే! ఈ విషయాన్ని కూడా సభలో పవన్ ప్రస్తావించే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అనంతరం అక్కడే భోజనం చేసి, సాయంత్రం 4 గంటలకు విశాఖకు చేరుకుని సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలు, తన అభిమానులతో పవన్ సమావేశం తర్వాత 4న హైదరాబాద్‌కు  వస్తాడని సమాచారం.

ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుండటంతో ముందునుండే ప్రజల్లోకి వెళుతూ పవన్ కల్యాణ్ పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.