‘మిర్రా మిర్రా మీసం’ మెలేసిన కాటమరాయుడు

Pawan-Kalyan-Katamarayudu-Mira-Mira-meesam-audio-trending

Pawan-Kalyan-Katamarayudu-Mira-Mira-meesam-audio-trending

కాటమరాయుడు సినిమా అనుకుంటున్నప్పటినుండి ప్రమోషన్స్‌లో దూసుకెళ్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఉండడమేకాకుండా తాజాగా రిలీజ్ అయిన కాటమరాయుడు టైటిల్ సాంగ్ ‘మిర్రా మిర్రా మీసం’ ఫుల్ ట్రెండింగ్ అవుతోంది. ఆన్‌లైన్‌లో ఆడియో ట్రాక్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ సందదడితో సోషల్‌మీడియాలో వైరల్ అయి కేవలం ఐదు గంటల్లోనే మిలియన్ మార్క్ దాటేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ‌ృతిహాసన్ జంటగా నటిస్తున్న ‘కాటమరాయుడులోని టైటిల్ సాంగ్  యూట్యూబ్‌లో ఇప్పటివరకు 14.5 లక్షల వ్యూస్‌తో , 1.45 లక్షల లైక్స్‌తో రికార్డ్ సృష్టించింది.

అనూప్ రూబెన్స్ సంగీతంలో రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్‌తో వచ్చిన ఈ పాట వైరల్ అవ్వడమేకాకుండా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇప్పటికే టాకీ పార్టు దాదాపు పూర్తి అయిపోయింది. అయితే మిగిలిన రెండు పాటల షూటింగ్‌కోసం కాటమరాయుడు టీం యూరప్‌కి వెళ్ళనుంది.

ఆ తర్వాత మార్చి 14న భారీగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసి అందులోనే థియాట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయాలని అనుకుంటోంది చిత్ర యూనిట్. అజిత్ తమిళ సినిమా వీరమ్‌కు రీమే‌క్‌గా రూపొందుతున్న ఈ సినిమాను ఈనెల 24న విడుదల చేయాలని ప్లాన్స్‌లో ఉన్నారు నిర్మాత శరత్ మరార్.

Have something to add? Share it in the comments

Your email address will not be published.