ప్రీరిలీజ్ ట్రెండ్ కొనసాగిస్తానంటున్న కాటమరాయుడు

Pawan Kalyan Katamarayudu Prerelease function may be on March18th

Pawan Kalyan Katamarayudu Prerelease function may be on March18th

తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీ తెరలేపిన కొత్త సాంప్రదాయాన్ని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కొనసాగించడానికి రెడీ అయ్యారట. సరైనోడు సినిమాతో ఆడియో వేడుకలను పక్కనబెట్టి సినిమా విడుదలకు ముందు ప్రీరిలీజ్ వేడుకలు చేసిన ట్రెండ్‌ను రామ్‌చరణ్ ధృవ సినిమాకు, చిరంజీవి ఖైదీ 150 సినిమాకు కంటిన్యూ చేసి హిట్ కొట్టారు. ఇప్పుడు అదేబాటలో పవర్‌స్టార్ పయనిస్తున్నారు.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా షూటింగ్ వేగవంతంగా జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌లో దూసుకెళ్తున్న కాటమరాయుడు పబ్లిసిటీని మరింత వేగవంతం చేయాలని ప్లాన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ నెల 3నుండి పబ్లిసిటీ విషయంలో వేగంగా దూసుకెళ్ళాలని 3తేదీ సాయంత్రం 4గంటలకు ఆన్‌లైన్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్టు దాదాపు పూర్తి అయిపోయింది. అయితే మిగిలిన రెండు పాటల షూటింగ్‌కోసం కాటమరాయుడు టీం ఈనెల 4న యూరప్‌కి వెళ్ళనుంది. ఆ తర్వాత మార్చి 18న భారీగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసి అందులోనే థియాట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయాలని అనుకుంటోంది చిత్ర యూనిట్. ఉగాది కానుకగా నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శరత్‌మరార్ నిర్మాణంలో డాలీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది.

Pawan Kalyan Katamarayudu Prerelease function may be on March18th

Have something to add? Share it in the comments

Your email address will not be published.