కాటమరాయుడి టార్గెట్ ఏంటో తెలుసా????

Pawan Kalyan Katamaryudu aims for the huge openings on Release day

Pawan Kalyan Katamaryudu aims for the huge openings on Release day

టాలీవుడ్‌లో అందరి కళ్ళూ ఇప్పుడు కాటమరాయుడి ఓపెనింగ్‌ వసూళ్ళపైనే ఉంది. ఈనెల 24న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న కాటమరాయుడు మొదటి వీకెండ్ కలెక్షన్లపైనే ఇప్పుడందరూ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే సినిమా అనుకుంటున్నప్పటినుండి స్టిల్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో సంచలనం సృష్టించి అందరి నోళ్ళలో నానుతోంది. అలాంటి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉండబోతోందన్నదానిపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. కోలీవుడ్ హిట్ మూవీ వీర‌మ్ సినిమాకు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమాను గోపాల‌…గోపాల డైరెక్ట‌ర్ డాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం, గ‌తంలో గ‌బ్బ‌ర్‌సింగ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబో అయిన ప‌వ‌న్‌-శృతి క‌లిసి న‌టించిన సినిమా కావ‌డం కాటమరాయుడికి ప్ల‌స్ కానుంది.

నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌వ‌న్ స‌న్నిహితుడు శ‌ర‌త్‌మరార్ నిర్మించిన ఈ సినిమాకు రిలీజ్‌కు ముందే రూ.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఇక ఓవ‌ర్సీస్ రైట్స్ అయితే ఏకంగా రూ 11.5 కోట్ల‌కు కొన్నారు. తొలి రోజు ఏపీ, తెలంగాణ‌లో దాదాపు అన్ని థియేట‌ర్ల‌లోను కాట‌మ‌రాయుడు రిలీజ్ అవుతోంది. తొలి రోజే కాట‌మ‌రాయుడు రూ.40 కోట్ల వ‌సూళ్ల‌ను టార్గెట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో ప్లాప్ టాక్ తెచ్చుకున్న స‌ర్దార్ సినిమాతోనే ప‌వ‌న్ ఏకంగా రూ.31 కోట్లు తొలి రోజు కొల్ల‌గొట్టాడు. ఇక ఇప్పుడు కాట‌మ‌రాయుడుకు క‌నీసం యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా రూ.40 కోట్లు ఈజీగా వ‌చ్చేస్తాయని లెక్కలేస్తున్నారు. ఈ నెల 24న సోలోగా రిలీజ్ అవుతుండ‌డం కూడా కాట‌మ‌రాయుడ‌కు ప్ల‌స్ కానుంది.

సినిమాకు యావ‌రేజ్ టాక్ వ‌స్తే ఫ‌స్ట్ వీకెండ్‌లోనే రూ.50 కోట్లు సులువుగా దాటేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌లు వేస్తున్నాయి. అదే హిట్ టాక్ వ‌స్తే ప‌వ‌న్ ప్ర‌భంజ‌నాన్ని ఎవ్వ‌రూ ఆపలేరనే టాక్ వినిపిస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.