‘పెళ్ళి చూపులు’ సినిమాకు జాతీయ అవార్డుల పంట

pellichoopulu-movie-bags-two-national-awards
pellichoopulu-movie-bags-two-national-awards
కంటెంట్ ఉంటే కటౌట్ అక్కర్లేదని నిరూపించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించిన సినిమా పెళ్ళిచూపులు. చిన్న సినిమాగా తెరకెక్కి పెద్ద సినిమా రేంజ్‌లో హిట్ అయిన పెళ్ళిచూపులు సినిమాకు అవార్డుల పంట కొనసాగుతోంది. ఐఫాలో అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఇప్పుడు జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఢిల్లీలో 64వ జాతీయ చలన చిత్ర అవార్డులను జ్యూరీ సభ్యులు ప్రకటించారు. ఇందులో రెండు కేటగిరీల్లో ‘పెళ్లిచూపులు’ సినిమా జాతీయ అవార్డులను దక్కించుకుంది.
రాజ్ కందుకూరి(ధ‌ర్మ ప‌థ క్రియేష‌న్స్‌), య‌ష్ రంగినేని(బిగ్ బెన్ సినిమాస్‌) నిర్మాతలుగా త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర కొండ‌, రీతూ వర్మ జంటగా రూపొందిన ఈ సినిమా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. డైరెక్టర్ త‌రుణ్ భాస్క‌ర్ సినిమాను కాస్త ఢిపరెంట్‌గా తెరకెక్కించడంతోపాటు వివేక్ సాగ‌ర్ మ్యూజిక్‌, నాగేష్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఈ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రియదర్శి రూపంలో ఓ విభిన్న నటుడు అందాడనే చెప్పుకోవచ్చు.
ఈ సినిమా ఇప్పుడు జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ సంభాషణలు విభాగంలో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అదరగొట్టే డైలాగ్స్ అందించిన తరుణ్‌ భాస్కర్‌ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు.

ఉత్తమ ప్రజాదరణ చిత్రం ‘శతమానం భవతి’:

సంక్రాంతి కానుకగా దిల్‌రాజు సమర్పణలో సతీష్ వేగ్నేష దర్శకత్వంలో తెరకెక్కిన శతమానంభవతి చిత్రం జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపికైంది. కుటుంబ విలువలకు పట్టంకట్టేలా తెరకెక్కిన ఈ సినిమా మంచి ప్రజాదరణ పొందడంతోపాటు మంచి కలెక్షన్లను రాబట్టింది. అంతేగాక ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమాలో కొరియోగ్రఫీ చేసిన రాజు సుందరంను ఉత్తమ నృత్యదర్శకుడిగా జ్యూరీ ఎంపిక చేసింది.
మరోవైపు హిందీలో జాతీయ ఉత్తమ నటుడి అవార్డుని రుస్తుం సినిమాకిగాను అక్షయ్‌కుమార్ గెలుచుకోగా , ఉత్తమ చిత్రంగా సోనమ్‌కపూర్ ప్రధానపాత్రలో తెరకెక్కిన నీర్జా సినిమాను ఎంపికచేశారు. అంతేగాక ఉత్తమ సామాజిక చిత్రంగా పింక్ ఎంపికైంది.

అవార్డులు:

 • * ఉత్తమ నటుడు – అక్షయ్‌కుమార్‌(రుస్తమ్‌)
 • ఉత్తమ నటి – సురభి లక్ష్మి(మిన్నామినుంగు)
 • ఉత్తమ హిందీ చిత్రం – నీర్జా
 • ఉత్తమ సామాజిక చిత్రం – పింక్‌
 • ఉత్తమ దర్శకుడు – రాజేశ్‌(వెంటిలేటర్‌)
 • ఉత్తమ సహాయ నటి – జైరా వాసిమ్‌(దంగల్‌)
 • ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ చిత్రం – శివాయ్‌
 • ఉత్తమ సంభాషణలు – తరుణ్‌ భాస్కర్‌(పెళ్లిచూపులు)
 • ఉత్తమ సంగీత దర్శకుడు – బాపు పద్మనాభ(అల్లమ-కన్నడ)
 • ఉత్తమ కన్నడ చిత్రం – రిజర్వేషన్‌
 • ఉత్తమ తమిళ చిత్రం – జోకర్‌
 • ఉత్తమ ప్రజాదరణ చిత్రం – శతమానంభవతి
 • సినిమాలకు స్నేహపూర్వక రాష్ట్రం – ఉత్తర్‌ప్రదేశ్‌
 • ప్రత్యేక జ్యూరీ అవార్డు – మోహన్‌లాల్‌(జనతాగ్యారేజ్‌, పులిమురుగన్‌)

Have something to add? Share it in the comments

Your email address will not be published.