ఎమ్మెల్యే బోండా ఉమను అరెస్ట్ చేయాలని హెఆర్సీలో పిటిషన్

Petetion filed against TDP Controversial MLA Bonda Uma on Sai Sree Death

Petetion filed against TDP Controversial MLA Bonda Uma on Sai Sree Death

కన్నతండ్రి పట్టించుకోక క్యాన్సర్‌తో బాధపడుతూ మృతిచెందిన విజయవాడకు చెందిన సాయిశ్రీకి వైద్యం అందకుండా చేశారని బాలల హక్కుల సంఘం మానవ హక్కుల సంఘంలో పిటిషన్ వేసింది. టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుతో పాటు, మరణించిన సాయిశ్రీ తండ్రి మాదంశెట్టి శివకుమార్‌లను వెంటనే అరెస్టు చేయాలని పిటిషన్‌లో పేర్కొంది.

సాయిశ్రీ వైద్యం కోసం ఉన్న ఇంటిని అమ్మనీయకుండా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీయులు అడ్డుకోవడం, ఆస్తి కోసం తండ్రి ముఖం చాటేయడంతో ఆరోగ్యం విషమించి చిన్నారి మృతి చెందింది. అంతకు ముందు తనను బ్రతికించాలని తండ్రిని కోరుతూ వీడియో మెసేజ్‌లను పంపిన సాయిశ్రీ వేదన ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కంటతడి పెట్టిస్తోంది.

పిటిషన్ స్వీకరించిన మానవహక్కుల సంఘం జులై 20నాటికి నివేదిక ఇవ్వాలని విజయవాడ సీపీని హెచ్‌ఆర్సీ ఆదేశించింది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.