ఆదివారం కూడా పనిచేస్తాయట!

Petrol Bunks remain open on Sundays despite the decision to shut down on Weekend

Petrol Bunks remain open on Sundays despite the decision to shut down on Weekend

ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పెట్రోలు వాడకాన్ని తగ్గించడం ద్వారా ఇంధన వనరులను పరిరక్షించుకోవాలని పిలుపును అమలు చేయాలని పెట్రోల్ బంకు యజమానుల సంఘం నిర్ణయించింది. అందులో భాగంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల మాదిరిగానే మే14 నుండి ప్రతీ ఆదివారం పెట్రోల్‌ బంకులు పని చేయవని ప్రకటించారు.

దీంతో రేపటినుండి ప్రతీ ఆదివారం మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో పెట్రోలు బంకులు పని చేయవని అందరూ అనుకున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానాల్లో ఈ నిబంధనల అమల్లోకి వస్తుందని యజమానుల సంఘం ప్రకటించింది.

అయితే రేపు దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ బంకులు పనిచేస్తాయని పెట్రోల్ బంకు యజమానుల సంఘం తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ అమరం ప్రకటించారు. దీంతో ముందుగా ప్రకటించిన విధంగా మే 14 నుండి ఆదివారం పెట్రొల్ బంకుల మూసివేతని నిర్ణయాన్ని విరమించుకున్నామని రాజీవ్ అమరం ప్రకటించారు.

అయితే ఆదివారం పెట్రోల్‌ బంకులను మూసివేయడం అనే నిర్ణయం ఇప్పటిదేం కాదని కొన్నేళ్ల కిత్రం ప్రతీ ఆదివారం పెట్రోల్‌ బంకులను మూసేవాళ్లమని చెబుతున్నారు బంకు యజమానులు. కానీ ఆయిల్‌ కంపెనీల కోరిక మేరకు తిరిగి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని అంటున్నారు. ఈసారి కూడా ఆదివారం మూసేయాలని నిర్ణయించినప్పటికీ తెరిచి ఉంచాలని అందరూ కోరడం వల్లే మళ్ళీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.