పోలిచర్ల హరనాథ్ టిక్ టాక్ ట్రైలర్ విడుదల

PH Productions Tik Tok telugu movie Trailer launched

PH Productions Tik Tok telugu movie Trailer launched

PH ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ‘హోప్’ చిత్రానికి నేషనల్ అవార్డు అందుకొని , చంద్రహాస్ సినిమాకి స్వర్ణ నందిని పొంది, సతీష్, దేవకట్టాలాంటి దర్శకుల్ని, వెన్నెల కిషోర్, పార్వతీ మెల్టెన్‌లాంటి నటులని ఇండస్ట్రీకి పరిచయం చేసి చేసిన సరోజినీ దేవి నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు గ్రహీత పోలిచర్ల హరనాథ్ నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం ‘ టిక్ టాక్’.ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో టిక్ టాక్ ట్రైలర్ ని విడుదల చేశారు.

పోలిచర్ల హరనాథ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు తీసిన సినిమాకు భిన్నంగా ఉండాలని కామెడీ హర్ర్రర్‌గా ఉండేలా టిక్ టాక్ మూవీని తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమాలో అందరికీ దగ్గరయ్యే అన్ని విధాలైన అనుభూతులు ఇందులో ఉంటాయని, ఇది ఒక పక్కా ఎంటర్‌టైన్మెంట్ సినిమా. ఇందులో మిగతా సినిమాల మాదిరిగా బూతు, చిన్నపిల్లలను భయపెట్టే హర్రర్ ఏమాత్రం ఉండదు. నిర్మాతగా ఇన్ని కుటుంబాలకు సహాయం చేస్తున్నామంటే ఎంతో సంతప్తిగా ఉంటుంది. అంతేగాక ఈ సినిమా కోసం డ్యాన్సులు, ఫైట్లు నేర్చుకొన్నాను. ఈ చిత్ర ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. అని అన్నారు. అన్నారు.

 

తారాగణం: పోలిచర్ల హరనాథ్, నిషిగంధ (తొలి పరిచయం), మౌనిక ( తొలి పరిచయం), రాహుల్, సందీప్, ఆనంద్, సాయికృష్ణ, అల్లూ రమేష్, రమణి తదితరులు

సాంకేతిక నిపుణులు : సినిమాటోగ్రఫీ: పి.వంశీకృష్ణ, సంగీతం: S&B Music Mill, ఎడిటర్: వెంకట రమణ, ఆర్ట్: E.గోవింద్, కాస్ట్యూమ్స్:జనకముని, మేకప్: ఈశ్వర్, స్టంట్స్: వై.రవి, కొరియోగ్రాఫర్: గోవింద్, లిరిక్స్: కరుణాకర్, చారి, మూలకథ: లిఖిత్ శ్రీనివాస్

కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్- నిర్మాత – దర్శకత్వం: పోలిచర్ల హరనాథ్

Have something to add? Share it in the comments

Your email address will not be published.