“స్ట్రేంజర్”లో ఏం జరుగబోతోంది?

Phani film factory stranger completes second schedule
Phani film factory stranger completes second schedule
 స్వీయ దర్శకత్వంలో యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి నిర్మిస్తున్న చిత్రం “స్ట్రేంజర్”.  మర్డర్ మిస్టరీ నేపథ్యంలో.. గోవా బ్యాక్ డ్రాప్ లో ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా సాగే కథనంతో ఫణి ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది. ఈ షెడ్యూల్ లో ఒక పాటను కూడా చిత్రీకరించారు.
ఒక పాటతోపాటు.. సెకండ్ షెడ్యూల్ లో కృష్ణ చైతన్య, జావేద్ లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించామని దర్శకనిర్మాత ఫణికుమార్ అద్దేపల్లి తెలిపారు. శివ హరీష్, సమీర్ హీరోలుగా.. ఆలియా తేజారెడ్డి హీరోయిన్లుగా..కృష్ణ చైతన్య, జావేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి.. డైరెక్షన్ డిపార్ట్ మెంట్: ప్రణీత్, కిరీటి, విజయ్, చందు, ధనుంజయ్, కెమెరా: అశ్విన్-ప్రేమ్ చంద్, స్టైలింగ్: సరస్వతి అద్దేపల్లి, సంగీతం: జితేందర్, రచన-నిర్మాణం-దర్శకత్వం: ఫణికుమార్ అద్దేపల్లి !!

Have something to add? Share it in the comments

Your email address will not be published.