హర్రర్ సినిమా పిశాచి-2 ప్లాటినం డిస్క్ వేడుక 

pishachi2 platinum disc celebrations attended by Telangana Government Delhi representative VenugopalaChary in Prasad Labs
pishachi2 platinum disc celebrations attended by Telangana Government Delhi representative VenugopalaChary in Prasad Labs
స్వర్ణభారతి క్రియేషన్స్ పతాకం పై లయన్ సాయి వెంకట్ అందిసున్న పిశాచి-2 ప్లాటినం డిస్క్ వేడుక ప్రసాద్ లాబ్స్‌‌‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ట్రైలర్‌ను, ప్రముఖ నిర్మాత మల్కాపురం శివ కుమార్ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. పోస్టర్ ను వేణుగోపాలాచారి ఆవిష్కరించారు. 
వేణుగోపాలాచారి మాట్లాడుతూ ‘నిర్మాతగా సాయి వెంకట్ చాలాకాలంగా తెలుసు. ఆయన రియల్ ఎస్టేట్ రంగంలోనూ, సేవా  కార్యక్రమాల్లోనూ..  ఇప్పుడు నిర్మాణ రంగం పై దృష్టి సారించి కన్నడంలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో పిశాచి-2గా విడుదల చేస్తున్నారు. ఇప్పుడు హారర్ పిక్చర్స్ సక్సెస్ అవుతున్నాయి. సినిమా బావుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అన్ని విధాలా నచ్చే కధాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సమస్యలను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూస్తానని” అన్నారు. 
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లడుతూ ‘కన్నడలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్న సాయి వెంకట్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.  
హీరోయిన్ సిప్రా గౌర్ మాట్లడుతూ.. “మంచి కధాకదాంశంతో రూపొందిన ఇంత మంచి చిత్రంలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. తప్పకుండా మాకందరికి మంచి సక్సెస్ ఫుల్ సినిమా అవుతుందన్న నమ్మకముంది” అన్నారు. 
ఏప్రిల్ 7ల విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత సాయి వెంకట్ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.