ఈ పిశాచి ఎలా భయపెడుతుందో??

Pishachi2 releasing on APRIL 21st
Pishachi2 releasing on APRIL 21st
స్వర్ణ భారతి క్రియేషన్స్ పతాకంపై లయన్ సాయి వెంకట్ నిర్మిస్తున్న చిత్రం “పిశాచి-2ష‌. `డేంజర్ జోన్` అన్నది ట్యాగ్ లైన్.  నల్లగట్ల శ్రీనివాస్ రెడ్డి-తిరుక్కోవళ్ళూరి మురళీకృష్ణ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ చిత్రానికి.. లయన్ ఏ.వేణుమాధవ్, కొలను సురేంద్రరెడ్డి, అట్లూరి రామకృష్ణ సహ నిర్మాతలు. ఏప్రిల్ 21న సినిమా విడుద‌ల‌వుతుంది.
చిత్ర హీరోయిన్ శిప్రా  గౌర్ మాట్లాడుతూ… తెలుగులో టెన్తులో మూవీ చేశాను. తర్వాత హిందీలో ఒకటి, తమిళంలో రెండు, కన్నడలో రెండు సినిమాలు చేశాను. తెలుగులో పిశాచి 2 గా రిలీస్ అవుతున్న చిత్రం కన్నడలో 150 రోజులు ఆడి నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.తెలుగులో కూడా విజయవంతమౌతుందని టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నా అన్నారు.
సాయి వెంక‌ట్ మాట్లాడుతూ, ` క‌న్న‌డ భాష‌లో పెద్ద విజ‌యం సాధించిన చిత్ర‌మిది. ఏ సినిమాలో నైనా విష‌యం ఉంటే హిట్ అవుతుంది. ఈసినిమా కూడా ఆ కోవ‌కు చెందించే. పిశాచి వ‌ల్ల ఓ గ్రామ ప్ర‌జ‌లు ఎదుర్కున్న ఇబ్బందులేంటి?  వాటి నుంచి ఆ దుర్గామాత ఎలా బ‌య‌ట పడేసింది అన్న‌దే క‌థ‌. ప్ర‌తీ స‌న్నివేశం ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. 100 థియేట‌ర్ల‌లలో సినిమా విడుద‌ల చేస్తాం. తెలుగు ప్రేక్ష‌కులంతా సినిమా ను ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.
నిర్మాత తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ, ` బాహుబ‌లి-2 సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందే పిశాచి ప్రేక్ష‌కుల ముందుకు ఓ పెద్ద సినిమాలా వ‌స్తుంది. ప్రేక్ష‌కులంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.