ఎంత మేధావులు రా నాయనా…

plane-forced-to-fly-back-in-afghanistan-after-two-mps-miss-flight

plane-forced-to-fly-back-in-afghanistan-after-two-mps-miss-flight

నార్మల్‌గా మనమెక్కాలనుకున్న బస్సో, ట్రైనో, ఫ్లైటో ఎక్కాలనుకున్నప్పుడు కాస్త ముందుగానే అక్కడికి చేరుకుంటాం. ఒకవేళ మనం అక్కడికి చేరుకోవడం లేట్ అయి మిస్ అయితే మామూలుగా ఏం చేస్తాం… తరువాత వేరే ఏదైనా ఉందా అని అడిగి వెళ్తాం. అయితే ఇద్దరు మేధావులు తమ తెలివితేటలతో, అధికార బలంతో వాళ్ళను ఎక్కించుకోకుండా వెళ్ళిపోయిన విమానాన్ని సైతం వెనక్కి తెప్పించుకున్నారు. అయితే ఇది మన దేశంలో మాత్రం కాదులేండి.

ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఎంపీలు అబ్దుల్‌ రెహమాన్‌ షహీదని, హుస్సేన్‌ నసేరి కాబుల్‌ నుంచి బమియాన్‌ వెళ్లాల్సి ఉంది. కానీ సరైన సమాయానికి విమానాశ్రయానికి చేరుకోకపోవడంతో ఇద్దరు ఎంపీలు కామ్ ఎయిర్‌కు చెందిన విమానాన్ని మిస్‌ అయ్యారు. దీంతో ఆగ్రహించిన ఎంపీలు బమియాన్‌లోని వారి మద్దతుదారులకు చెప్పి విమానం ల్యాండ్‌ అవకుండా చేశారు. బమియన్‌ విమానాశ్రయం రన్‌వేపై అడ్డంగా రాళ్లు పెట్టడంతో విమానం దిగేందుకు కుదరలేదు.

దీంతో చేసేదేమి లేక విమానాన్ని మళ్లీ కాబూల్‌ విమానాశ్రయానికి తీసుకొచ్చి ల్యాండ్ చేశారు. అయితే ఈ సారి విమానం వచ్చి ల్యాండ్ అవగానే ఆ ఎంపీలు విమానం ఎక్కి బమియాన్‌ చేరుకున్నారు. ఈ తతంగం అంతా జరుగుతున్నప్పుడు ఆ విమానంలో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.