కేదార్‌నాథ్‌లో ప్రధాని తొలి పూజ

PM Narendra Modi offers prayers at Kedarnath temple in Uttarakhand as pilgrimage opens for 6 months 

PM Narendra Modi offers prayers at Kedarnath temple in Uttarakhand as pilgrimage opens for 6 months 

ప్రధాని నరేంద్ర మోడీ కేదార్‌నాథ్ ఆలయంలో తొలిపూజ నిర్వహించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతీ యేడాది ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయం యేడాదిలో ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంచుతారు.

మంచుతో ఆలయం పూర్తిగా కప్పి ఉండటంతో ఆలయ ద్వారాలను మూసివేసి తిరిగి ఆరు నెలల తర్వాత తెరుస్తారు. అలా ప్రతీ యేడాది ఆలయం ద్వారాలు తెరిచే సమయానికి ఈరోజు ఉదయం ప్రరధాని నరేంద్ర మోడీ కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించుకొని తొలి పూజ చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ గుడి తలుపులను స్వయంగా తెరిచారు. దాదాపు ఆరు నెలల తర్వాత భక్తుల దర్శనార్థం తిరిగి తెరుచుకున్న ఈ ఆలయంలో ప్రధాని మోదీ తొలిపూజ చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ నిర్వాహకులు ప్రధానిని సత్కరించారు.

ఆలయ నమూనా ప్రతిమను బహుమతిగా అందజేశారు. అనంతరం ప్రధాని ఆలయ సందర్శనకు వచ్చిన భక్తులకు అభివాదం చేశారు. పలువురు చిన్నారులను పలకరించారు. అంతకుముందు ప్రధాని డెహ్రాడూన్‌ నుంచి ప్రత్యేక విమానంలో కేదారినాథ్‌కు వెళ్లారు. ఉత్తరాఖండ్‌ సీఎం టీఎస్‌ రావత్‌, గవర్నర్‌ కేకే పౌల్‌లు మోదీకి పుష్పగుచ్చం అందచేసి ఘన స్వాగతం పలికారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.