హవాలా మాస్టర్‌మైండ్ ఎవరు??

Police investigating the culprits and Mastermind behind Hawala Case in Vishakapatnam

Police investigating the culprits and Mastermind behind Hawala Case in Vishakapatnam

తీగ లాగితే డొంకంతా కదిలినట్లు హవాలా కుంభకోణానికి సంబంధించి ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఒక చిన్న సమాచారంతో తనిఖీలు మొదలుపెడితే పెద్ద రాకెటే బయటపడింది. బ్యాంకు అధికారుల సహకారంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్టోన్‌ క్రషర్‌ యజమాని వడ్డి శ్రీనివాసరావు కుమారుడు మహేష్‌ ఎవరికీ అనుమానం రాకుండా భారీగా హవాలా వ్యాపారాన్ని మొదలుపెట్టి సుమారు 1500కోట్ల రూపాయల హవాలా వ్యాపారాన్ని చేశాడు. హవాలా లావాదేవీలను గుట్టుచప్పుడుకాకుండా నడిపించడంతో వ్యాపారులు అతన్ని నమ్మి భారీ నగదుని విదేశాలకు పంపడానికి అతన్ని నమ్ముకున్నారు. మహేశ్‌ హవాలా వ్యాపారానికి కొందరు బ్యాంకు అధికారులు సైతం సహకరించడంతో నోట్ల రద్దు తర్వాత ఇతని వ్యాపారానికి రెక్కలొచ్చేశాయి.

దీంతో హవాలా వ్యవహారంపై ఆదాయపు పన్ను అధికారుల దృష్టి పడడంతో నిఘా పెట్టిన అధికారులు కోల్‌కత్తాలోని బోగస్ కంపెనీల నుండి విశాఖపట్టణంలోని అకౌంట్లకు అమౌంట్ వస్తోందని గుర్తించారు. అంతేగాక వివిధ ఖాతాలనుండి ఒకే ఒక్క బ్యాంకు ఖాతాలో 570 కోట్లు, మరోసారి 90కోట్లు జమ అవడంతో విస్తుపోయిన అధికారులు  ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి కోల్‌కతాలోని డొల్ల కంపెనీలపై దాడులు చేసి పలువుర్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాల్లో దాడులు చేసి అన్నింటికీ మూలకారణం వడ్డి మహేశ్‌ అని తేల్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

కోల్‌కతా నుంచి డొల్ల కంపెనీల ద్వారా విశాఖలోని బ్యాంకులకు వచ్చిన నిధులు తిరిగి సింగపూర్‌, బ్యాంకాక్‌, మలేషియా, హాంకాంగ్‌, చైనాలకు తరలించినట్లు తేల్చారు. విదేశాలతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు తేలడంతో ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌’ అధికారులకు విశాఖ ఐ.టి. అధికారులు సమాచారమిచ్చారు. బ్యాంకు అధికారులతో కుమ్మక్కై చేసిన మోసం కావడంతో నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రధాన నిందితుడు మహేశ్‌ను పోలీసులకు అప్పగించారు. మహేశ్‌ వెనక ఎవరైనా సూత్రధారులున్నారా? ఎవరైనా రాజకీయ నాయకుడో? బడా పారిశ్రామికవేత్త హస్తమో? ఉండొచ్చని పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇప్పటికే ఈ హవాలా కేసుకు సంబంధించి ఎంతో సీరియస్‌గా విచారణ చేస్తున్న పోలీసులకు మహేశ్ వెనక ఉన్న మాస్టర్‌మైండ్‌ని కనిపెట్టే పనిలో ఉన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.