కామెడీ హారర్ తో ‘ టిక్ టాక్ ‘

గతంలో ‘హోప్’, ‘చంద్రహాస్’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన నటుడు, నిర్మాత, దర్శకుడు పోలిచర్ల హరనాధ్ తాజాగా నటిస్తూ దర్శకనిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం ‘టిక్ టాక్’. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ‘హరనాధ్ పోలిచర్ల టిక్ టాక్.కామ్’ పేరిట రూపొందించిన వెబ్ సైట్ను  హైదరాబాద్ సారధి స్టూడియోలో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ప్రారంభించారు.
 ఆర్. పి. పట్నాయక్ మాట్లాడుతూ.. ‘హరనాధ్ గారు చక్కని సదుద్దేశ్యంతో సినిమాలు చేస్తుంటారు. ప్రస్తుతం సినిమాకు ప్రమోషన్ చాలా అవసరం. ఈ నేపథ్యంలో హరనాధ్ గారు వెబ్ సైట్ లాంచ్ చేయడం చాలా మంచి ఆలోచన. హరనాధ్ గత చిత్రాల వలె ఈ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
పోలిచర్ల హరనాధ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సినిమాకి పబ్లిసిటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. సినిమాని ప్రేక్షకులకు చేరువ చేయడంలో భాగంగా ఈ వెబ్ సైట్ ను ప్రారంభిచాను. కామెడీ హారర్ గా రూపొందుతున్న చిత్రమిది. అన్ని వర్గాల వారిని అలరించేలా ఈ చిత్రం ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత రెగ్యులర్ గా 5 సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.
పోలిచర్ల హరనాధ్, నిషిగంధ, మౌనిక, రాహుల్, సందీప్ ఆనంద్, సాయి కృష్ణ, అల్లూ రమేష్, రమణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్ అండ్ బి మ్యూజిక్ మిల్, కెమెరా: పి. వంశీకృష్ణ, ఎడిటింగ్: వెంకట రమణ, ఆర్ట్: ఏ.గోవింద్, పాటలు: కరుణాకర్, చారి, డాన్స్: గోవింద్ సి.హెచ్, మూలకథ: లిఖిత్ శ్రీనివాస్, కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం- నిర్మాత: పోలిచర్ల హరనాధ్.

Have something to add? Share it in the comments

Your email address will not be published.