టార్గెట్ 2019: జగన్‌కోసం రంగలోకి ప్రశాంత్ కిషోర్?

political-strategist-prashant-kishor-started-his-strategy-work-in-ap-politics-for-jagan-mohan-reddy-ysrcp

political-strategist-prashant-kishor-started-his-strategy-work-in-ap-politics-for-jagan-mohan-reddy-ysrcp

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వ్యూహకర్తల చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి. ఇప్పటివరకు దేశంలో జరిగిన చాలా ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయానికి అవసరమైన వ్యూహాలందించి విజయతీరాన నిలబెట్టిన వ్యూహకర్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌పై దృష్టిపెట్టారు. 2019 ఎన్నికలే టార్గెట్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్‌జగన్మోహన్ రెడ్డి ప్రముఖ రాజకీయ వ్యూహకర్తను తమ పార్టీ తరుపున పనిచేయాల్సిందిగా నియమించున్నారు. 2014 ఎన్నికల్లో మోదీ విజయానికి కారణమైన ఈ పొలిటికల్‌ మైండ్, ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో తన ట్రిక్స్ ప్లే చేయడానికి సిద్ధమైపోయారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ప్రశాంత్ కిషోర్ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ యేడాది చివర్లో ఆయన తన పని ప్రారంభించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ప్రస్తుత రాజకీయ సమీకరణాలను అంచనా వేసుకొనేందుకు ప్రశాంత్ కిషోర్ ముందుగానే పని మొదలుపెట్టారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాల అమలు తీరు, ప్రజలు ప్రభుత్వంపై ఏఏ విషయాల్లో సంతృప్తిగా ఉన్నారు, ఏఏ అంశాలపై వ్యతిరేకతతో ఉన్నారో తెలుసుకునే సర్వే ఇప్పటికే ప్రశాంత్ అండ్ టీం మొదలుపెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అంతేగాక అన్ని వర్గాల ప్రజల స్పందన కనుగోనే ప్రయత్నం చేస్తున్నారని, అసలు వైసీపీకి జిల్లాల్లో ఎంత బలం ఉందో అనే అంశాలు కాకుండా, చంద్రబాబు పాలనపై, బీజేపీ పాలన, మోదీ చరిష్మాపై ప్రజల్లో స్పందన ఎలా ఉందో అన్న అంశాలపైనా ఆరా తీస్తున్నారు. అందులోభాగంగా ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ ఈ నెల రెండో వారం నుంచే తన పని మొదలు పెట్టారట. గోదావరి జిల్లాల్లో ఒక జిల్లాతో పాటు, ఉత్తరాంధ్రలో రెండు జిల్లాలు , రాయలసీమలో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ప్రశాంత్ కిశోర్ అండ్ టీం పర్యటించిందట.

పాలనపై అన్ని జిల్లాల నుంచి ప్రజా స్పందన తీసుకున్న తర్వాత కులాల వారీగా అవి ప్రభావితం చేస్తున్న జిల్లాలు, కులాల్లో బలమైన నాయకులు, బూత్‌ల వారీగా విశ్లేషణను ప్రశాంత్ టీం చేపట్టనుందంటున్నారు. దీనిలో భాగంగా కాపు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, బీసీలు, మైనార్టీ వర్గాల్లో స్పందన, ఎన్నికలపై ప్రభావం అనే అంశాలపై సర్వే నిర్వహించనున్నారు. ఆ తర్వాత వైసీపీకి గట్టి పట్టున్న ప్రాంతాలు, పట్టు లేని ప్రాంతాల్లో, ఏం చేస్తే బలాన్ని పెంచుకోవచ్చు, జగన్ వ్యకిగత ఇమేజ్, చరిష్మాను ఎలా పెంచడం అనే అంశాలపై దృష్టి పెడతారని చెబుతున్నారు. ఈ తరహా సర్వేలు కంటిన్యూ‌గా చేసుకుంటూ ప్రతి నెలలో నాలుగోవారం మొత్తం కేవలం సమీక్షకే కేటాయించి దాని బట్టి ప్రశాంత్‌ స్ట్రాటజీలో భాగంగా పొత్తులపై ప్రభావాన్ని ఎన్నికలకు ముందు మాత్రమే అంచనా వేస్తారు.

మరోవైపు బీజేపీతో చేతులు కలపడానికి తాము సిద్ధమనే సంకేతాలు జగన్ ఇచ్చిన సందర్భంలో వైసీపీ, బీజేపీ పొత్తుపై, వైసీపీ ఓటు బ్యాంకుతో పాటు, జనరల్‌ ఓటర్లలో ఎలాంటి ప్రభావం ఉందో కనుక్కొనే  పనిలో ఉన్నారు. 2014లో మోడీ అధికారంలోకి రావడానికి స్ట్రాటజీ వర్కౌట్ చేసి సక్సెస్ అయిన ప్రశాంత్ స్ట్రాటెజీ ఆ తర్వాత బీహారా, పంజాబ్‌లో వర్కౌట్ అయ్యింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పంజాబ్ మినహా యూపీతో పాటు మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా స్ట్రాటజీ దెబ్బకొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ బలోపేతానికి ప్రశాంత్ స్ట్రాటజీ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.