తెలుగు సినిమాకు కొత్త అర్థం చెప్పిన దాసరి ఇక లేరు

Popular film director Dasari Narayana Rao passes away

Popular film director Dasari Narayana Rao passes away

హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు (75) మంగళవారం నాడు తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. కిమ్సలో చికిత్స పొందుతున్న ఆయన సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన కిమ్స్ ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో చేరిన ఆయన ఆరోగ్యం వికటించింది. గత ఐదు నెలలుగా ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మే 4, 1942లో జన్మించిన దాసరి 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అంత పెద్ద సంఖ్యలో సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించారు. 53 చిత్రాలకు నిర్మాతగా ఉన్న ఆయన 250 చిత్రాలకు రచయితగా ఉన్నారు. తెలుగు జర్నలిజం పట్ల ఆసక్తితో ఉదయం పత్రికను ప్రారంభించి పత్రికా ప్రపంచంలో ఒక కొత్త నూతన ఒరవడిని సృష్టించారు.

1972లో తాత మనవడు చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి ప్రవేశించిన ఆయన తొలి చిత్రానికే నంది అవార్డును పొంది రికార్డు సష్టించారు.  తొమ్మిది నంది అవార్డులు, రెండు జాతీయ అవార్డులను స్వంతం చేసుకున్న ఆయన తెలుగు సినిమాకు ఒక కొత్త అర్ధాన్ని ఇచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.  • Anonymous says:

    A very Grate Director. Ceni jagattu lo Darsakula Importance chati cheppina Dasari

  • Gundamraj yadagiriri Rao. says:

    The great director actor producer left us today. No body substitute him. IT IS GREAT LOSS TO THE FULM INDUSTRY. HIS SOUL REST IN PEACE