‘తెలుగు’పై కన్నేసిన సన్నీలియోన్

Porn Star Sunny Leone eyes on Telugu film Industry

Porn Star Sunny Leone eyes on Telugu film Industry

‘సన్నీ లియోన్’ ఇండియాలో ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. పోర్న్‌స్టార్‌‌గా క్రేజ్ ఉన్న టైంలో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిచాలా తక్కువ టైంలోనే బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది సన్నీ. హిందీలో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ సన్నీలియోన్‌కి దేశ వ్యాప్తంగా అభిమానులకు కొదవ లేదు. అందుకే తెలుగు, తమిళంలోను ఈ అమ్మడికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. తెలుగులో ‘కరెంట్ తీగ’ సినిమాలో మెరిసిన సన్నీ మరోసారి టాలీవుడ్ సినిమాలో కనిపించనుంది.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో పోలీస్ బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కిస్తున్న పీఎస్వీ ‘గరుడవేగ ‘అనే సినిమాలో సన్నీలియోన్ ఐటెమ్ సాంగ్ చేస్తోందట. ఈ ఐటం సాంగ్ కోసం ఇప్పటికే గరుడవేగ యూనిట్ ముంబై ఫిలింసిటీలో భారీ సెట్టింగ్‌ వేసి అందులో చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. బాలీవుడ్‌లో గందీబాత్‌…, రాం చాహే లీల చాహే..వంటి బాలీవుడ్ సూప‌ర్‌హిట్స్‌కు కొరియోగ్ర‌ఫీ అందించిన విష్ణుదేవా ఈ ఐటం బీట్‌కు కొరియోగ్రఫీని అందిస్తున్నాడు. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాకు కొరియోగ్ర‌ఫీ అందించిన‌ విష్గ్ణుదేవా చాలా గ్యాప్ త‌ర్వాత తెలుగులో మాస్ నంబ‌ర్‌కు కొరియోగ్ర‌ఫీ చేయ‌నున్నారు.

Garudavega

రాజశేఖర్ బర్త్ డే సందర్భంగా పీఎస్వీ గరుడవేగ చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కువ శాతం జార్జియాలోనే చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలో ‘విశ్వరూపం’ ఫేమ్ పూజా కుమార్ హీరోయిన్‌గా నటించింది. ఈ అంచ‌నాల‌కు స‌న్నిలియోన్ స్పెష‌ల్ సాంగ్ గ‌రుడ వేగ‌పై అంచ‌నాల‌ను ఇంకా పెంచుతుంది.

ఈ ఒక్క సినిమానేకాకుండా ఈమధ్య పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన రోగ్ సినిమా ఆడియో ఫంక్షన్లో కూడా సన్నీ లియోన్ స్పెషల్ డ్యాన్సులు చేసి తెలుగు చిత్రపరిశ్రమపై తనకున్న ఇంట్రెస్ట్‌ని చూపించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.