ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అదరగొట్టిన కాటమరాయుడు

powerstar pawankalyan emotional speech in Katamarayudu pre release event

 

powerstar pawankalyan emotional speech in Katamarayudu pre release event

పేరుకు తగ్గట్లుగా తనదైన స్టైల్లో చాలా ఎమోషనల్‌గా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నాడు మన కాటమరాయుడు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌లో పవన్ కళ్యాణ్, శృతిహాసన్ జంటగా డాలీ దర్శకత్వంలో తెరకెక్కిన కాటమరాయుడు ప్రీరిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది. సినిమాల్లోకి వచ్చి 20ఏళ్ళు అయిన పవన్‌కళ్యాణ్ ఈ వేడుక సాక్షిగా తన మనసులోని భావాలను అభిమానులతో పంచుకున్నారు. సాధారణంగా ఏ ఫంక్షన్‌లో అయినా కళ్యాణ్ మాట్లాడుతున్నాడంటే తన పరిధి దాటి ఒక్కమాట కూడా మాట్లాడకుండా తన వ్యక్తిగత విషయాలను ఏమాత్రం బయటపడనీయకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడే కాటమరాయుడు ఈసారి అదే పద్ధతిలో మొదలుపెట్టినప్పటికీ తన మనసులోని అనేక విషయాలను బయటికి చెప్పేశాడు. ఇప్పటివరకు తను నటించిన సినిమాలు తన మనసులోని కదిలే భావాలకు ప్రతీక అని చెప్పుకొచ్చిన ఆయన యువతలో స్ఫూర్థిని నింపే దిశగా మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘ ఇలాంటి సభల్లో మాట్లాడటం అలవాటు తప్పింది. భయంగా ఉంది. ఇక్కడకు రాలేకపోయిన అభిమానులకు నా క్షమాపణలు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. హీరోనవుతానని ఒక్కసారికూడా అనుకోలేదు. నిజజీవితంలోనూ ఏ పని ఇచ్చినా.. అది తోటపని కావచ్చు.. వీధులు ఊడ్చే పని అయినా ఎలాంటి పనైనా నిజాయితీగా చేస్తాను. నాకు ఏ పని ఇచ్చినా నిసిగ్గుగా పనిచేయలని అనుకొనే మనస్తత్వం నాది. సినిమాలు కూడా నాకు భగవంతుడు ఇచ్చిన భిక్ష అనుకొనే వొళ్ళు దగ్గరపెట్టుకొని పనిచేస్తున్నాను.  భవిష్యత్‌లో ఎలాంటి బాధ్యతలు అప్పగించినా చేస్తాను. ప్రజాక్షేమం కావాలంటే అధికారం అనేది అంతిమ లక్ష్యం కాదనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చాను. అందుకే ఎలాంటి ఫలితం కోసం చూడకుండా ముందుకు వెళ్తుంటాను.

నా జీవితంలో ప్రతీ సినిమాతో నేను చాలా నేర్చుకున్నాను. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తర్వాత ‘గోకులంలో సీత’ సినిమా చేస్తున్నప్పుడే రైటర్ పోసాని కృష్ణమురళిగారి దగ్గర అసిస్టెంట్ రైటర్‌గా ఉన్నప్పటినుండి  త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నాకు తెలుసు. ఆ సినిమాలోని ‘ప్రేమే దైవం.. ప్రేమే సర్వం.. ప్రేమే సృష్టికి మూలం’ అనే డైలాగ్‌ ఇప్పటికీ గుర్తిండిపోయింది. నాకు సాధారణంగా నా సినిమాల్లోని డైలాగ్స్ ఏమాత్రం గుర్తుండవు. అయితే అవి మరీ మనసుకి దగ్గరగా ఉంటే ఇప్పటికీ ఈ డైలాగ్ గుర్తుంచుకున్నట్లు గుర్తుంచుకుంటాను.  త్రివిక్రమ్ ‌గారు నా మిత్రుడు అవ్వడం నాకు చాలా సంతోషమిచ్చింది.’

ఆ తర్వాత వచ్చిన ‘సుస్వాగతం’లో తండ్రిని కోల్పోయిన కథానాయకుడికి తెలియదు. ఆ పాత్ర చేసిన నేను క్లైమాక్స్‌లో నిజంగానే ఏడ్చాను. దానికోసం నా చెంపపై గట్టిగా కొట్టుకొని నిజంగా ఏడ్చేశాను. తండ్రి పోయినప్పుడు ఎలాంటి భావాలు ఉండాలో వాటి కోసం  40 టేక్‌లు చేశాను.  ఆ తర్వాత వచ్చిన ‘జల్సా’ టైంలో నా తండ్రి చనిపోతే ఏడ్వలేదు. ఎందుకంటే అప్పటికే సుస్వాగతంలో తండ్రి చనిపోయిన సీన్ కోసం నా బాధ అంతా బయటికొచ్చేసింది. ‘తొలిప్రేమ’ తీసుకుంటే అందులోలాగా ప్రేమించాలి.. అమ్మాయిల చుట్టూ తిరగాలి అనుకుంటాం. బాధ్యత లేని ప్రేమ ఏం? ప్రేమ అనుకున్నా. నాలో కదిలే భావాలు ఒక్కో సినిమాతో బయటకు వచ్చాయి. ‘తమ్ముడు’ సినిమాకు చాలా కష్టపడ్డా. నా ప్రాణాలను పణంగా పెట్టా. ఎప్పుడో నేర్చుకున్నా మార్షల్‌ ఆర్ట్స్‌ మళ్లీ చేయాల్సి వచ్చింది. ఒక పిచ్చి.. ఉన్మాదంతో చేశా. నా చేతులు రాత్రిళ్ళు ఇప్పటికీ ఇలా వంకర్లు తిరిగిపోతాయి.’

‘మన భవిష్యత్‌ రాయగలిగేది పక్కనోడు కాదు.. మనమే. నా ఎదుగుదల నేను అనుకున్నంత. ఇప్పటికీ కిందిస్థాయిలో ఉండటమే ఇష్టం. ఆలోచన విస్తృతి పెద్దగా పెంచుకుంటాను కానీ… అడుగులు భూమికి బలంగా అతుక్కొని ఉండాలని కోరుకుంటాను. జీవితంలో ఎదిగే ప్రతీ ఒక్కడూ పక్కనోడిని తొక్కేయాలని అనుకుంటాడు. కానీ అందరం మనుషులమే అని గుర్తుంచుకొని ముందుకెళ్ళినప్పుడే మన జీవితానికి సార్థకత ఉంటుంది. అదే విషయాన్ని బద్రి సినిమాలో చెప్పాం.  ‘బద్రి’ సినిమా ఇద్దరు అమ్మాయిల ప్రేమకథ కాదు. నువ్వు ఒక మనిషివే అని చెప్పేది. దానిలో ఒక డైలాగ్‌లో ఉంది ‘నువ్వు నందా అయితే నేను బద్రి బద్రినాథ్‌’ అంటా. అంటే నువ్వూ రక్త మాంసాలు ఉన్న మనిషివే అని చెప్పాడానికి అదే నిదర్శనం.

‘ఖుషి’ సినిమా రిలీజ్‌కు ముందు హైటెక్‌సిటీలో ప్రివ్యూ చూసే సమయంలో ఇంటర్వెల్‌కు ముందు నాలో ఏదో తెలియని ఓ అనుభూతి వచ్చి నాలో శక్తిని అంతటినీ లాగేసుకున్నట్లు అనిపించింది రాబోయే రోజులు కష్టకాలం అని. సినిమా చూస్తుంటే ఏదో శక్తి కోల్పోయినట్టు అనిపించింది. అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఆ తర్వాత ప్రతీరోజు భగవంతుడి ముందు మోకరిల్లి నీకు ఏది అనిపిస్తే అది ఇవ్వు అని కోరుకొనేవాడిని. మళ్లీ ‘గబ్బర్‌సింగ్‌’లో పోలీస్‌స్టేషన్‌ సన్నివేశాలు చేస్తుంటే మళ్ళీ ఆ శక్తి తిరిగి వచ్చింది. జీవితం అంటే గెలుపోటముల మిళితం. ఇప్పుడు ఆ స్థాయికి వచ్చి ఆగాను.’

 

‘నా ఉద్దేశ్యంంలో నాకు చిరంజీవిగారే హీరో… నేను హీరోని కాదు. ఎందుకంటే అన్నయ్యపై అభిమానులు చూపించే ప్రేమ అలాంటిది. ‘సుస్వాగతం’ విజయోత్సవ సభకు రమ్మన్నారు. రాకపోతే పొగరు అనుకుంటారు నా వల్ల కాదు అన్నాను. 5 కి.మీ. వూరేగింపు ఉంటుందన్నారు. అందరి ప్రేమ చూసి నాకు భయమేసింది. నా రెండు చేతులు ఎత్తి నమస్కరించాను. అప్పుడు నా తండ్రి మాటలు గుర్తొచ్చాయి. ‘ఈ సృష్టిలో అందరూ ఒక్కటే’ అనే మాటలు నాలో ప్రతి ధ్వనించాయి. నన్ను అభిమానించే ప్రతీ ఒక్కరికీ నేను శిరస్సు వచ్చి మోకరిల్లుతాను. ఇవాళ ఒక ఆలోచనతో సినిమా ఈ తీశాం. మీకు నచ్చితే చూడండి. నచ్చకపోతే ఎలాంటి ఫలితం వచ్చినా స్వీకరిస్తా. ‘ అని ప్రసంగాన్ని ముగించాడు కాటమరాయుడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.