రాజమౌళి, ప్రభాస్‌ల వల్లే ‘బాహుబలి’ సాధ్యమైందట

Prabhas and Rajamouli detrmination only created records like Bahubali says VijayendraPrasad in Bahubali2 Pre release event

Prabhas and Rajamouli detrmination only created records like Bahubali says VijayendraPrasad in Bahubali2 Pre release event

ఏ సినిమా చేయాలన్నా 24 క్రాఫ్టులు కలిసి ఏకధాటిగా సమన్వయంతో పనిచేస్తేనే సాధ్యమౌతుంది. అయితే కొన్ని పెద్ద సినిమాలకు మాత్రం వీటన్నింటికీ మించి ముఖ్యంగా దర్శకుడు, హీరోలు ఇద్దరూ ఎంతో పట్టుదలతో ఉంటేనే అది సాకారమౌతుంది. అలాంటిదే బాహుబలి సినిమా విషయంలో జరిగిందంటున్నారు రచయిత విజయేంద్ర ప్రసాద్.

బాహుబలి సినిమా అనుకొనేే ముందు రాజమౌళి తన తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్ళి ప్రభాస్‌తో ఓ సినిమా తీయాలనుకుంటున్నాను ఏదైనా మంచి కథ నా కోసం రాయండి అని అడిగారట. అయితే తనకు ఎలాంటి కథ కావాలో అందులో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలో చెప్పి అవన్నీ అందులో ఉండాలని కండిషన్ పెట్టారట రాజమౌళి. అయితే ఓ మూడు రోజుల త‌ర్వాత క‌ట్ట‌ప్ప క్యారెక్ట‌ర్ గురించి విజయేంద్రప్రసాద్ చెప్పినప్పడు రాజ‌మౌళి క‌ళ్ళ‌ల్లో ఆనందం క‌న‌ప‌డిందట. ఆ తర్వాత మరో మూడు రోజుల త‌ర్వాత ఓ త‌ల్లి న‌దిలో బిడ్డ‌ను పెట్టుకుని ఈదుకుంటూ వెళ్ళే సీన్, త‌న వ‌ల్ల కాకుండా పిల్ల‌వాడిని కాపాడుతూ చ‌నిపోయే సీన్ చెప్పారట.

Rajamouli in Baahubali2 Pre release event

అలా సీన్స్ రాసుకుంటూ బాహుబలి క‌థ మొత్త‌ం నాలుగు నెలల్లో రెడీ అయ్యిందని చెప్పుకొచ్చారు విజయేంద్రప్రసాద్. అయితే బాహుబలి క‌థ‌ సాకారం అయ్యిందంటే దానికి కార‌ణం మాత్రం  ఇద్ద‌రు వ్య‌క్తులు ఉన్నారని బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో చెప్పారు. అందులో ఒక‌రు ప్ర‌భాస్ అట. ఐదేళ్ళు  వేరే సినిమాలేవైనా చేసుంటే కోట్ల రూపాయ‌లు సంపాదించి ఉండేవాణ్ణి అనే ఆలోచన లేకుండా ఒకే సినిమా కోసం ప‌నిచేశాడు. ఈ ఐదేళ్ళ‌లో త‌ను డ‌బ్బు, పేరు గురించి చూడ‌కుండా సినిమాపై న‌మ్మ‌కంతో, ప‌ట్టుద‌ల‌తో సినిమా చేశాడని మెచ్చుకున్నారు.

Prabhas and Anushka in Baahubali2 Pre release event

అలాగే ఇక రెండో వ్య‌క్తి ప్ర‌భాస్‌కు ఈ సినిమాపై న‌మ్మ‌కాన్ని ఇచ్చిన దర్శకుడు రాజ‌మౌళి. ప్ర‌భాస్‌కే కాదు…త‌న చుట్టు ప‌క్క‌ల ఉన్న‌వారంద‌రికీ ఈ సినిమా గొప్పద‌‌ృశ్యకావ్యంలాా రాబోతోందని చెప్పి అంద‌రితో ప‌నిచేయించాడు. అది రాజ‌మౌళి గొప్ప‌త‌నం. రాజ‌మౌళి, ప్ర‌భాస్‌లు త‌మ‌కు వ‌చ్చిన కూలీ కంటే ఎక్కువ ప‌నిచేశారు. ఈ సినిమా కోసం బాహుబ‌లి, ప్ర‌భాస్‌లు ఏక సినిమా వ్ర‌తం చేశారు అని మెచ్చుకున్నారు విజయేంద్రప్రసాద్.

Baahubali2 Pre release event

Have something to add? Share it in the comments

Your email address will not be published.